ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

కోచింగ్ సెంటర్లు, రాబడితో వృద్ధి చెందుతున్న పరిశ్రమలుగా మారాయి -శ్రీ జగదీప్ ధన్‌కర్


కోచింగ్ సంస్కృతి 'గ్యాస్ ఛాంబర్'కు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి.

వార్తాపత్రికల్లో ప్రకటనల కోసం కోచింగ్ సెంటర్లు భారీగా ఖర్చు చేయడాన్ని పరిశీలించాలి - శ్రీ జగదీప్ ధన్‌కర్

ఛాంబర్ లో సమావేశం నిర్వహించాలన్న రాజ్యసభ చైర్మన్ అభ్యర్థనను ఫ్లోర్ లీడర్లు తిరస్కరించడం, బహిష్కరించడం పార్లమెంటరీ మర్యాదను నీరుగార్చడమే. విచారం వ్యక్తం చేసిన శ్రీ జగదీప్ ధన్‌కర్

దిల్లీలోని కోచింగ్ సెంటర్ లో యూపీఎస్సీ అభ్యర్థుల మృతిపై రాజ్యసభలో చర్చ

Posted On: 29 JUL 2024 4:50PM by PIB Hyderabad

దిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్‌లో యూపీఎస్సీ అభ్యర్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన నేపథ్యంలో రాజ్యసభలో రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చ జరిగింది.  చర్చను అనుమతిస్తూ రాజ్యసభ ఛైర్మన్ శ్రీ జగదీప్ ధన్‌ఖర్ వ్యాఖ్యానిస్తూ, "దేశంలోని యువత డెమోగ్రాఫిక్ డివిడెండ్ ను పెంపొందించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. కోచింగ్ అనేది వాస్తవికంగా వాణిజ్యంగా మారిందని నేను కనుగొన్నాను." అని అన్నారు.

వార్తాపత్రికల్లో ప్రకటనల కోసం కోచింగ్ సెంటర్లు భారీగా ఖర్చు చేయడంపై శ్రీ ధన్‌ఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసి ఖర్చు చేస్తున్నారన్నారు. "కోచింగ్ లు అధిక రాబడితో వృద్ధి చెందుతున్న పరిశ్రమలుగా మారాయని అన్నారు. వార్తాపత్రికల్లో ముందు వచ్చే మొదటి, రెండవ పేజీల్లో ప్రకటనలే వస్తున్నాయన్నారు. కోచింగ్ సెంటర్లు ప్రకటనలపై చేసే ఖర్చులో ప్రతీ పైసా విద్యార్తుల నుంచే వస్తోందని అన్నారు. వీటికోసం తయారవుతున్న ప్రతీ భవనం విద్యార్థుల డబ్బు నుంచే వస్తోందని అన్నారు.

కోచింగ్ సంస్కృతి కారణంగా దేశంలో ఏర్పాటు చేసిన సెంటర్లు గ్యాస్ చాంబర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు. దేశంలో అవకాశాలు విస్తరిస్తున్న కొద్ది ఈ ఇరుకైన కోచింగ్ సెంటర్లు సమస్యాత్మకంగా మారుతున్నాయి. ఈ సెంటర్లు గ్యాస్ చాంబర్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి అని ఆయన అన్నారు.  దేశంలో ఉన్న ఇతర ఉపాధి, నైపుణ్య అవకాశాలపై యువతకు అవగాహన కల్పించాలని ఆయన సభ్యులను కోరారు.

వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లను చైర్మన్  తన చాంబర్ లో చర్చకు పిలవగా, వారు దానిని బహిష్కరించడం పట్ల విచారం వ్యక్తం చేసిన ధన్‌ఖర్ .. 'నా ఆవేదనను పంచుకుంటాను, నా బాధను పంచుకుంటాను. రాజ్యసభ సభాపతి, తన ఛాంబర్ లో ఒక సమావేశానికి గౌరవ సభ్యులను అభ్యర్థించినప్పుడు, ఈ తిరస్కరణ సమంజసనీయమైనది మాత్రమే కాదు, పార్లమెంటరీ మర్యాదను నీరుగార్చడమే. ఫ్లోర్ లీడర్లు చాంబర్ లో చైర్మన్ ను బహిష్కరించాలని కోరడం కచ్చితంగా సరైన పద్ధతి కాదన్నారు.

దిల్లీలోని కోచింగ్ సెంటర్ లో యూపీఎస్సీ అభ్యర్థుల మృతిపై చర్చించాలని రాజ్యసభ సభ్యులు సుధాంశు త్రివేది, స్వాతి మలివాల్ రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ విషయాన్ని అత్యవసరమని పేర్కొంటూ రూల్ 267 కింద చర్చించడానికి సిద్ధంగా ఉన్నందున రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు చైర్మన్ అనుమతించారు. అయితే రాజ్యసభ ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) శ్రీ మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్ష పార్టీలు రూల్ 267 కింద చర్చించడానికి విభేదించారు. ప్రధాన పార్టీలు అంగీకరిస్తే, సభ ఏకాభిప్రాయంతో మాత్రమే రూల్ 267 కింద ఏదైనా చర్చిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు.

 

 

***


(Release ID: 2038823) Visitor Counter : 52