పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రీన్ టూరిజం ప్రచారం

Posted On: 29 JUL 2024 4:31PM by PIB Hyderabad

 

యుఎన్ డబ్ల్యుటిఓ బారోమీటర్ ప్రకారం, మే 2024లో, అంతర్జాతీయ పర్యాటకం ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో త్వరితగతిన అనుకూలిస్తోంది. ఈ ప్రాంతాల్లో రాకలు 2024 క్యూ1 లో కోవిడ్ మహమ్మారికి ముందు స్థాయిలలో 82 శాతానికి చేరుకున్నాయి. ఇదే సమయంలో ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోని భారత్ లో అత్యధికంగా 89 శాతానికి రికవరీ రేటు చేరుకుంది.
 
సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకానికి అంతర్జాతీయ పర్యటక గమ్యస్థానంగా భారత్ ను నిలిపేందుకు భారత ప్రభుత్వం సుస్థిర పర్యటన కోసం జాతీయ వ్యూహాన్ని రూపొందించింది. సుస్థిర పర్యాటక అభివృద్ధి కోసం ఈ క్రింది వ్యూహాత్మక స్తంభాలను గుర్తించారు:
 
1. పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం
 
2 జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం
 
3. ఆర్థిక సుస్థిరతను ప్రోత్సహించడం
 
4. సామాజిక-సాంస్కృతిక సుస్థిరతను ప్రోత్సహించడం
 
5. సుస్థిర పర్యాటక ధృవీకరణ పథకం
 
6. ఐఈసీ, సామర్థ్య పెంపుదల
 
7. పరిపాలన
 
పర్యాటక గమ్యస్థానాల సమగ్రాభివృద్ధి కోసం, దేశంలో సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యంతో బలమైన ఫ్రేమ్ వర్క్ ను సృష్టించే లక్ష్యంతో పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ 2.0 రూపంలో స్వదేశ్ దర్శన్ పథకాన్ని పునరుద్ధరించింది.
 
స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఇప్పటి వరకు 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 పర్యాటక గమ్యస్థానాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరిపి గుర్తించారు. వాటి వివరాలు అనుబంధం-1లో ఇవ్వబడ్డాయి.
 
స్వదేశ్ దర్శన్ 2.0 కింద ఒక ఉప పథకం "సవాలు ఆధారిత గమ్య అభివృద్ధి (ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్)", మన పర్యాటక ప్రదేశాలను సుస్థిర, బాధ్యతాయుతమైన గమ్యస్థానాలుగా మార్చడానికి పర్యాటక విలువ గొలుసు అంతటా పర్యాటక అనుభవాన్ని పెంపొందించడానికి ఒక్కో పర్యాటక ప్రాంత సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద మంత్రిత్వ శాఖ 42 గమ్యస్థానాలను 4 రంగాల కింద గుర్తించింది.
 
(1): సంస్కృతి, వారసత్వ గమ్యస్థానాలు
(2): ఆధ్యాత్మిక పర్యాటకం
(3): ఎకో టూరిజం, అమృత్ ధరోహర్ గమ్యస్థానాలు
(4): వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ డెస్టినేషన్.
 
ఎకోటూరిజం, అమృత్ ధరోహర్ రంగాల కింద గుర్తించిన గమ్యస్థానాల వివరాలు అనుబంధం-2లో ఇవ్వబడ్డాయి.
 
ఈ మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

***

 

అనుబంధం-1

 

స్వదేశ్ దర్శన్ 2.0 కింద గుర్తించిన గమ్యస్థానాల జాబితా:

 

క్ర. సం

రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం

గుర్తించిన గమ్య స్థానాలు

1

ఆంధ్రప్రదేశ్

గండికోట, అరకు-లంబసింగి

2

అరుణాచల్ ప్రదేశ్

నాచో, మెచుకా

3

అసోం

జోర్హాట్, కోక్రాఝార్

4

బిహార్

గయా, నలంద

5

చత్తీస్ గఢ్

బిలాస్ పూర్, జగదల్ పూర్

6

గోవా

పోర్వోరిమ్, కోవ్లా

7

గుజరాత్

దోలవీర, ద్వారక

8

హరియాణా

పంచకుల (మోర్ని)

9

హిమాచల్ ప్రదేశ్

పోంగ్ డ్యాం

10

జమ్ము కశ్మీర్

బసోలి

11

జార్ఘండ్

చండిల్

12

కర్ణాటక్

హంపి, మైసూరు

13

కేరళ

కుమరకోమ్, కోజికోడ్ (బేపూర్)

14

మధ్యప్రదేశ్

గ్వాలియర్ , చిత్రకూట్

15

మహారాష్ట్ర

సింధుదుర్గ్, అజంతా-ఎల్లోరా

16

మణిపూర్

మొయిరాంగ్ (బిష్ణుపూర్)

17

మేఘాలయ

షిల్లాంగ్, సోహ్రా

18

మిజోరం

ఐజ్వాల్, చంపాయ్

19

నాగాలాండ్

నియులాండ్, చుముకెడిమా

20

ఒడిషా

కోరాపూట్, 'ఖిందా గ్రామం'లో ప్రత్యేక ఆకర్షణతో పాటు దేబ్రీగఢ్

21

పంజాబ్

అమృత్ సర్, కపుర్తలా

22

రాజస్థాన్

 బుండి (కేశోరాయ్పట్నం), జోధ్ పూర్

23

సిక్కిం

గాంగ్ టక్, గ్యాల్షింగ్

24

తమిళనాడు

మామల్లపురం, నీలగిరి

25

తెలంగాణ

భవనగిరి, అనంతగిరి

26

త్రిపుర

ఆగర్తల, ఉనకోటి

27

ఉత్తర్ ప్రదేశ్

ప్రయాగ్ రాజ్, నైమిశరాయణ

28

ఉత్తరాఖండ్

పిత్తోర్ గర్, చంపావత్

29

చండీగఢ్

చండీగఢ్

30

లక్షదీవులు

లక్షదీవులు

31

పూదుచ్చేరీ

పుదుచ్చేరి, కరైకాల్

32

లడఖ్

లేహా, కార్గిల్

 

మొత్తం

57

 

అనుబంధం-2

ఎకో టూరిజం, అమృత్ ధరోహర్ కేటగిరీలో ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ కింద గుర్తించిన గమ్యస్థానాల జాబితా:

క్ర. సం

గమ్యస్థానాలు

రాష్ట్రం/ యూటీ

1

బిచోమ్ ఆనకట్ట

అరుణాచల్ ప్రదేశ్

 

2

శివసాగర్

అసోం

3

మయాలీ బాగీచా

ఛత్తీస్ ఘడ్

4

మాయెం గ్రామం

గోవా

5

థోల్ గ్రామం

గుజరాత్

6

ఉడిపి

కర్ణాటక

7

ముష్కోహ్ గ్రామం

లడఖ్

8

లక్షదీవులు

లక్షదీవులు

9

డోయం రిజర్వాయర్

నాగాలాండ్

10

కామారెడ్డి

తెలంగాణ

 

***


(Release ID: 2038818) Visitor Counter : 82