ఉక్కు మంత్రిత్వ శాఖ
2024 జాతీయ మెటలర్జిస్ట్ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానించిన ఉక్కు మంత్రిత్వ శాఖ
Posted On:
29 JUL 2024 3:11PM by PIB Hyderabad
లోహశాస్త్ర రంగంలో అందించిన విశేష సేవలను గుర్తించేందుకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ జాతీయ మెటలర్జిస్ట్(లోహశోధకుల) పురస్కారాలను అందించనుంది. ఆపరేషన్స్‌తో పాటు పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్ ఆండ్ డీ), వ్యర్థాల నిర్వహణ, వనరుల సంరక్షణ వంటి అంశాల్లో అందించిన సేవలను పరిగణలోకి తీసుకోనుంది. పరిశ్రమ, పరిశోధన, విద్యాసంస్థల నుంచి వ్యక్తులు జాతీయ మెటలర్జిస్ట్(లోహశోధకుల) పురస్కారాలకు (ఎన్ఎంఏ)-2024 దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించింది.
కింద పేర్కొన్న నాలుగు విభాగాల్లో అవార్డులు అందిస్తుంది:-
1. జీవన సాఫల్య పురస్కారం
2. జాతీయ మెటలర్జిస్ట్ పురస్కారం
3. యువ మెటలర్జిస్ట్ పురస్కారం
ఏ. పర్యావరణం
బి. లోహశాస్త్రం
4. ఇనుము, ఉక్కు రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్ ఆండ్ డీ)కి పురస్కారం
https://awards.steel.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 06/09/2024 సాయంత్రం 05:00 గంటలు.
జాతీయ మెటలర్జిస్ట్ పురస్కారాలకు సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలు, ఇతర నియమనిబంధనలు https://awards.steel.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
పరిశ్రమ, ఆర్ ఆండ్ డీ లేదా విద్యాసంస్థల్లో భారత్‌లో లోహశాస్త్ర రంగానికి సేవలు అందించిన భారతదేశ పౌరులను మాత్రమే పురస్కారాలకు అర్హులు. అభ్యర్థుల అర్హతను 01/01/2024 నుంచి పరిగణలోకి తీసుకుంటారు.
***
(Release ID: 2038607)
Visitor Counter : 79