ప్రధాన మంత్రి కార్యాలయం

పెట్టుబడులపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించిన భారత్, సౌదీ అరేబియా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సౌదీ యువరాజు మరియు ప్రధానిలు 2023 సెప్టెంబరులో తీసుకొన్న నిర్ణయం మేరకు, ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

వంద బిలియన్ యుఎస్ డాలర్ల మేర సౌదీ పెట్టుబడికి క్రియాత్మక సమర్ధనను అందించాలన్న భారత ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ

పెట్రోలియం, పునరుత్పాదక ఇంధనం, టెలికం, నూతన ఆవిష్కరణ వంటి రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై నిర్మాణాత్మక చర్చలు

Posted On: 28 JUL 2024 11:37PM by PIB Hyderabad

పెట్టుబడులపై భారతదేశం-సౌదీ అరేబియా ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో ఆదివారం నిర్వహించారు.  ఈ సమావేశానికి ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా, సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్ మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ లు సహాధ్యక్షత వహించారు.

 

టాస్క్ ఫోర్స్ లో భాగమైన సాంకేతిక బృందాల మధ్య జరిగిన చర్చలను ఇరు పక్షాలు సమీక్షించాయి.

 

 

శుద్ధీకరణపెట్రో కెమికల్ ప్లాంటులునూతన మరియు పునరుత్పాదక ఇంధనంవిద్యుత్తుటెలికంనూతన ఆవిష్కరణలు సహా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు గల అవకాశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయి.

 

పరస్పర ప్రయోజనకరమైన పద్ధతిలో రెండు వైపులా పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తీసుకోదగిన చర్యలపైన ఉభయ పక్షాలు సమగ్ర సమీక్ష జరిపాయి.

 

సౌదీ అరేబియా యువరాజు, ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా చేసిన ప్రకటన మేరకు పెట్టే 100 బిలియన్ యుఎస్ డాలర్ ల సౌదీ పెట్టుబడులకు అవసరమయ్యే క్రియాత్మక అండదండలను అందించాలని భారత ప్రభుత్వం వ్యక్తం చేసిన దృఢ సంకల్పాన్ని ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పునరుద్ఘాటించారు.

 

మరిన్ని చర్చలను జరపాలనినిర్దిష్ట పెట్టుబడులపై ఒక అంగీకారానికి రావడానికి ఇరు పక్షాల సాంకేతిక బృందాల మధ్య సంప్రదింపులను క్రమం తప్పక కొనసాగించాలని ఉభయ పక్షాలు సమ్మతించాయి.  చమురుగ్యాస్ రంగంలో పరస్పర ప్రయోజనకర పెట్టుబడిపై తదుపరి దఫా చర్చలను జరపడం కోసం పెట్రోలియం కార్యదర్శి నాయకత్వంలో ప్రతినిధి వర్గం సౌదీ అరేబియాకు వెళ్ళనుంది.   భారతదేశంలో సావరిన్ వెల్త్ ఫండ్ పిఐఎఫ్  కార్యాలయాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా సౌదీ అరేబియా ను ఆహ్వానించారు.

 

ఉన్నత స్ధాయి టాస్క్ ఫోర్స్ తదుపరి విడత సమావేశంలో పాల్గొనడానికి భారతదేశానికి రావాలని సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రిని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్వానించారు.

 

2023 సెప్టెంబరులో సౌదీ యువరాజుప్రధాని శ్రీ మొహమ్మద్ బిన్ సల్ మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ ఆధికారిక పర్యటన పై భారత్ వచ్చినప్పుడు ఆయన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జరిపిన చర్చల ఫలితంగా ద్వైపాక్షిక పెట్టుబడులకు మార్గాన్ని సుగమం చేయడానికి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు.  ఈ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ లో ఉభయ పక్షాలకు చెందిన సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ సభ్యులలో భారతదేశం తరఫున నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిఆర్థిక వ్యవహారాలువాణిజ్యంవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఇఎ)డిపిఐఐటిపెట్రోలియం మరియు సహజవాయు కార్యదర్శులు ఉన్నారు.  

 

***



(Release ID: 2038457) Visitor Counter : 36