రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

Posted On: 28 JUL 2024 8:22AM by PIB Hyderabad

భారతదేశ రాష్ట్రపతి పంజాబ్ గవర్నర్, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలకుడు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ రాజీనామా ను ఆమోదించారు.

 

2.     భారతదేశ రాష్ట్రపతి ఈ క్రింద పేర్కొన్న గవర్నర్ ల నియామకాలను కూడా ప్రకటించారు : -       

(i)           శ్రీ హరిభావూ కిసన్ రావు బాగ్ డే ను రాజస్థాన్ గవర్నర్ గా నియమించడమైంది.

(ii        శ్రీ జిష్ణు దేవ్ వర్మ ను తెలంగాణ గవర్నర్ గా నియమించడమైంది.

(iii)       శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ ను సిక్కిమ్ గవర్నర్ గా నియమించడమైంది.

(iv)        శ్రీ సంతోష్ కుమార్ గంగ్ వార్ ను జార్ఖండ్ గవర్నర్ గా నియమించడమైంది.

(v)         శ్రీ రామెన్ డేకా ను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమించడమైంది.

(vi)        శ్రీ సి.హెచ్. విజయశంకర్ ను మేఘాలయ గవర్నర్ గా నియమించడమైంది.

(vii)      తెలంగాణ గవర్నర్ (అదనపు బాధ్యత) తో పాటు జార్ఖండ్ గవర్నర్ గానూ ఉన్న శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించడమైంది.

(viii)     అసోమ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా ను పంజాబ్ గవర్నర్ గా నియమించడమైంది. దీనితో పాటు ఆయనను కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలకునిగా కూడా నియమించడమైంది.

(ix)       సిక్కిమ్ గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ను అసోమ్ గవర్నర్ గా నియమించడమైంది. దీనితో పాటు ఆయనకు మణిపుర్ గవర్నర్ గా అదనపు బాధ్యతను కూడా ఇవ్వడమైంది.

 

3.      పై నియామకాలు, వారు ఆ యా కార్యాలయాల పదవీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి అమలు లోకి వస్తాయి.

 

****


(Release ID: 2038181) Visitor Counter : 89