ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని పోయడం) కార్యక్రమం లో భాగంగా ఒక మొక్కను నాటిన ఉపరాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ప్రశంసలు

నాడు పోస్టు చేయడమైనది: 27 JUL 2024 10:04PM by PIB Hyderabad

భారతదేశ మాన్య ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఆయన మాతృమూర్తి గౌరవార్థం ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని అందించడం ప్రేరణదాయకంగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

భారతదేశ మాన్య ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఆయన తల్లి గారు శ్రీమతి కేసరి దేవి గౌరవార్థం యమున నది తీరం లో పర్యావరణ స్థలం అసిత లో ఈ రోజు ఒక మొక్కను నాటి, ఆ మొక్కకు నీటిని అందించారు. 

 

దీనిపై ప్రధాన మంత్రి ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘మార్గదర్శకం. అమ్మ పట్ల ఆదరంతో ఆమె ను గౌరవించుకోవడానికి మాననీయ  @VPIndia గారు మొక్కను నాటడం అందరికీ ప్రేరణను అందించేదిగా ఉంది.’’

 

 

 

***

DS


(రిలీజ్ ఐడి: 2038113) సందర్శకుల సూచీ సంఖ్య : : 127