గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేరళ రాష్ట్రానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి భారీ మౌలిక సదుపాయాలు

Posted On: 26 JUL 2024 5:31PM by PIB Hyderabad

కేరళ రాష్ట్రంలో గ్రామీణ అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం కోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ప్రదాన మంత్రి గ్రామ సడక్ యోజన-III (పీ ఎం జి ఎస్ వై -III) కింద రూ. 160.56 కోట్ల అంచనా పెట్టుబడితో,  159.86 కిలోమీటర్ల మేర 33 రోడ్లను  కేరళ రాష్ట్రానికి మంజూరు చేసింది.

ఈ ముఖ్యమైన కార్యక్రమం:

గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానాన్ని మెరుగు పరుస్తుంది, దూర ప్రాంత గ్రామాలు, పట్టణ కేంద్రాలు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.

ఆ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, వ్యాపారాన్ని పెంపొందిస్తుంది.

ఆరోగ్యం, విద్య, మార్కెట్ల వంటి కనీస అవసరాలైన సేవల అందుబాటు మెరుగు పరుస్తుంది.

ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించడం.

అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) అనే  ప్రభుత్వ వ్యూహానికి ఇది అనుగుణంగా ఉంటుంది.

రాష్ట్ర సమగ్ర  అభివృద్ధి పై పీ ఎం జి ఎస్ వై -III ప్రాజెక్ట్  సానుకూల ప్రభావం చూపగలదు. సమ్మిళిత అభివృద్ది పట్ల ప్రభుత్వ చిత్తశుద్ది ని ఇది బలోపేతం చేస్తుంది.

 



(Release ID: 2037863) Visitor Counter : 32