ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బడ్జెటు 2024-25 పై ప్రధాన మంత్రి స్పందన

Posted On: 23 JUL 2024 2:57PM by PIB Hyderabad

దేశాన్ని అభివృద్ధి పరంగా నూతన శిఖరాలకు చేర్చే ఈ ముఖ్యమైన బడ్జెటు విషయంలో నా దేశ ప్రజలందరికీ నేను నా అభినందనలను తెలియజేస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికిఆమె బృందానికి కూడా నేను హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

సమాజంలో అన్ని వర్గాలకు సాధికారిత ను ఈ బడ్జెటు ప్రసాదిస్తుంది.  ఇది మన గ్రామాలలో సమృద్ధితో పాటు పేదలరైతుల సమృద్ధికి కూడా బాటను వేస్తుంది.  గత పదేళ్ళలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు.  ఈ బడ్జెటు మధ్య తరగతి ఆదాయ వర్గంలోకి ఇటీవలె ప్రవేశించిన వారికి సాధికారితను కల్పిస్తూ ఉండటంతో పాటు విద్యకునైపుణ్యాభివృద్ధికి సరికొత్త అవకాశాలను అందిస్తుంది.  ఇది మధ్య తరగతికి కొత్త బలాన్ని ఇవ్వడంతో పాటుఆదివాసీలకుదళితులకువెనుకబడిన వర్గాలకు సాధికారిత కల్పనకై పటిష్టమైన ప్రణాళికలను తీసుకు వస్తుంది.  దీనికి తోడుఈ బడ్జెటు ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంతో పాటుగా చిరు వ్యాపారులుఎమ్ఎస్ఎమ్ఇ లు లేదా చిన్న పరిశ్రమల పురోగతికి కొత్త దారులను పరుస్తుంది.  తయారీమౌలిక సదుపాయాల కల్పన రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా ఈ బడ్జెటు ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడంతోపాటుఆర్థికాభివృద్ధి సంబంధ జోరును కూడా కొనసాగిస్తుంది.

మిత్రులారా,

ఉపాధికిస్వయంఉపాధికి మునుపెన్నడూ లేనన్ని అవకాశాలను కల్పించడం మా ప్రభుత్వ విధానంగా ఉంటూ వచ్చింది.  ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెటు ఈ నిబద్ధతను మరింత బలపరుస్తుంది.  ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (పిఎల్ఐ) పథకం ఎంతగా సఫలం అయిందో దేశమూప్రపంచమూ గమనించాయి.  ప్రస్తుతం ఈ బడ్జెటులో ప్రభుత్వం ‘ఉద్యోగంతో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకా’న్ని ప్రకటించింది.  ఈ పథకం దేశమంతటా కోట్ల కొద్దీ కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది;  ఈ పథకంలో భాగంగా యువతీ యువకులు తమ మొదటి ఉద్యోగాన్ని ఆరంభించినప్పుడు వారికి మొట్టమొదటి జీతాన్ని మా ప్రభుత్వం చెల్లిస్తుంది.  అది నైపుణ్యాభివృద్ధికి మరియు ఉన్నత విద్యకు ఉద్దేశించిన సహాయం కావచ్చులేదా ఒక కోటి మంది యువజనులకు ఇంటర్న్ షిప్ పథకం కావచ్చు.. పల్లెల్లో నివసించే వారికిపేదరికంతో సతమవుతున్న నేపథ్యాల నుంచి వచ్చే యువజనులకు అగ్రగామి వ్యాపార సంస్థలలో పని చేసేందుకు వీలు కల్పిలంచివారికి కొత్త అవకాశాల తలుపులను తెరుస్తుంది.  ప్రతి పట్టణంలోగ్రామంలోకుటుంబంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.  దీని కోసం పూచీకత్తు అక్కరలేని ‘ముద్ర’ రుణాల పరిమితిని ఇప్పుడున్న 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచడమైంది.  ఇది చిన్న వ్యాపారులు, ప్రత్యేకించి మహిళలుదళితులువెనుకబడిన వర్గాలతో పాటు ఆదివాసీ సముదాయాల స్వయం ఉపాధికి సాయపడుతుంది.

మిత్రులారా,

మనం అందరం కలసికట్టుగా భారత్ ను ప్రపంచ తయారీ కేంద్రం (గ్లోబల్ మేన్యుఫేక్చరింగ్ హబ్) గా తీర్చిదిద్దుదాం.  దేశంలో సూక్ష్మలఘుమధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) ల రంగం మధ్య తరగతితో సన్నిహితంగా పెనవేసుకొని ఉండడంతో పాటు పేదలకు ప్రధానమైన ఉద్యోగాలను కూడా సమకూర్చుతున్నది.  చిన్న పరిశ్రమలను పటిష్ట పరచడం ఈ దిశలో ఒక కీలకమైన చర్య అని చెప్పాలి.  ఈ బడ్జెటు  ఎమ్ఎస్ఎమ్ఇ లకు పరపతి లభ్యతలో సౌలభ్యాన్ని మెరుగు పరచడానికి కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.  దీనికి అదనంగాప్రతి జిల్లాలో తయారీఎగుమతి వ్యవస్థలను పెంచడానికి ఉద్దేశించిన ముఖ్య చర్యలు కూడా ఉన్నాయి.  ఒక జిల్లాఒక ఉత్పత్తి’ ఉద్యమానికి దన్నుగా నిలచే కార్యక్రమాలలో భాగంగా ఇ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు (ఎక్స్ పోర్ట్ హబ్స్)ఆహార నాణ్యత పరీక్షకు ఉద్దేశించిన 100 యూనిట్ లు ఉన్నాయి.

మిత్రులారా,

ఈ బడ్జెటు మన అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్)కునూతన ఆవిష్కరణల వ్యవస్థకు అనేక కొత్త కొత్త అవకాశాలను  కల్పించింది.  అంతరిక్ష ప్రధాన  ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి 1,000 కోట్ల రూపాయల నిధి కావచ్చులేదా ఏంజెల్ ట్యాక్స్ ను రద్దు చేయాలన్న నిర్ణయం కావచ్చు.. అనేక ముఖ్య చర్యలను తీసుకోవడమైంది.

మిత్రులారా,

రికార్డు స్థాయిలో అధిక మూలధన వ్యయం (కేపెక్స్) ఆర్థిక వ్యవస్థను మునుముందుకు వేగంగా నడిపించనుంది.  12 కొత్త పారిశ్రామిక కేంద్రాలునూతన శాటిలైట్ టౌన్ ల అభివృద్ధి, 14 ప్రధాన నగరాలకు రవాణా ప్రణాళికల వల్ల దేశవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక నిలయాలను (ఇకానామిక్ హబ్స్) ఏర్పడనుండడంతోకొత్త ఉపాధి అవకాశాలు అసంఖ్యాకంగా పెరగనున్నాయి.

మిత్రులారా,

ప్రస్తుతం రక్షణ రంగ సంబంధ ఎగుమతులు ఇదివరకు ఎరుగనంత అధిక స్థాయిలో ఉన్నాయి.  ఈ బడ్జెటులో రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దేందుకు అనేక అవకాశాలను కల్పించడమైంది.  భారత్ అంటే ప్రపంచంలో ఆసక్తి పెరిగితత్ఫలితంగా పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు వికసిస్తున్నాయి. పేదలకుమధ్యతరగతికి ఎన్నో అవకాశాలను పర్యటక రంగం అందిస్తున్నది.  ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రస్తుత బడ్జెటు ప్రత్యేక ప్రాధాన్యాన్ని కట్టబెడుతున్నది.

మిత్రులారా,

గత పదేళ్ళలో, పేదలకుమధ్యతరగతికి ఎన్ డిఎ ప్రభుత్వం పన్ను సంబంధ ఊరటను అందిస్తూ వస్తోంది.  ఈ బడ్జెటులో ఆదాయపు పన్ను తగ్గింపులనుస్టాండర్డ్ డిడక్షన్ పెంపుదలను ప్రకటించడమైందిదీనికి తోడు టిడిఎస్ నియమాలను సరళతరం చేయడంతో ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుకు కొంత అదనపు మొత్తం మిగలనుంది.

మిత్రులారా,

దేశ ప్రగతికి భారత్ లో ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధి కీలకం.  పూర్వోదయ’ దృష్టికోణం తో మా ప్రచార ఉద్యమం సరికొత్త జోరునుశక్తిని పుంజుకోనుంది.  రహదారులునీటి పథకాలువిద్యుత్తు పథకాల వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయడం ద్వారా భారత్ ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధిని మేం వేగవంతం చేస్తాం.

మిత్రులారా,

ఈ బడ్జెటు దేశ రైతులకు గొప్ప ప్రాధాన్యాన్ని కట్టబెడుతోంది.  ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన ఆహార ధాన్యాల నిలవ పథకాన్ని తీసుకు వచ్చిన తరువాత  మేం ఇప్పుడు కాయగూరల ఉత్పత్తి క్లస్టర్ లను ఏర్పాటు చేస్తున్నాం.  ఈ కార్యక్రమం చిన్న రైతులకు వారు పండించిన ఫలాలుకూరగాయలతో పాటు ఇతర ఉత్పత్తులను మెరుగైన ధరలకు అమ్ముకొనేందుకు కొత్త బజారులను అందుబాటులోకి తెస్తుంది.  అదే కాలంలో మధ్యతరగతికి పండ్లుకాయగూరల లభ్యతను పెంచడానికి దోహదపడుతుందిమధ్యతరగతి కుటుంబాలకు శ్రేష్ఠ పోషకాహారం దక్కేందుకు కూడా మార్గం సుగమం అవుతుంది.  వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధ స్థితికి చేరుకోవడం భారత్ కు ఎంతైనా అవసరం.  ఈ కారణంగా పప్పుధాన్యాలునూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి వీలుగా పటిష్టమైన చర్యలను ప్రకటించడమైంది.

మిత్రులారా,

పేదరికాన్ని నిర్మూలించడానికిపేదలకు సాధికారితను కల్పించడానికి ఉద్దేశించిన ప్రధాన కార్యక్రమాలను నేటి బడ్జెటులో చేర్చడమైంది.  పేదల కోసం మూడు కోట్ల కొత్త ఇళ్ళను నిర్మించాలనే నిర్ణయాన్ని తీసుకోవడమైంది.  జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ లో భాగంగా కోట్ల ఆదివాసీ కుటుంబాలకు కనీస సౌకర్యాలను అందించడం జరుగుతుంది.  దీనికి తోడు, ‘గ్రామ్ సడక్ యోజన’ ఏడాది పొడవునా 25,000 కొత్త గ్రామీణ ప్రాంతాలను రహదారి సదుపాయంతో జోడించిదేశంలో అన్ని రాష్ట్రాలలో సుదూర గ్రామాలకు మేలు చేయనుంది.

మిత్రులారా,

నేటి బడ్జెటు కొత్త అవకాశాలనుసరికొత్త శక్తిని తీసుకువచ్చింది.  ఈ బడ్జెటు లెక్కలేనన్ని ఉద్యోగాలను మరియు స్వయంఉపాధి అవకాశాలను సృష్టించిశ్రేష్ఠమైన వృద్ధి నిప్రకాశవంతమైన భవిష్యత్తును ప్రోత్సహిస్తుంది.  ఈ బడ్జెటు భారత్ ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఉత్ప్రేరకంగా పని చేస్తూఅభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు ఒక దృఢమైన పునాదిని వేస్తుంది.

దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.

అస్వీకరణ:  ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి భావానువాదం.  మూల ఉపన్యాసం హిందీ భాష‌ లో ఉంది.

 

***


(Release ID: 2036614)