ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక సర్వే 2024 గతం లో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఆర్థిక స్థాయిలో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించింది.
మానసిక ఆరోగ్య రుగ్మతలు గణనీయమైన ఉత్పాదకత నష్టాలతో సంబంధం కలిగి ఉన్నాయి
మానసిక ఆరోగ్య కార్యక్రమాలను మెరుగ్గా అమలు చేయడానికి విధానపరమైన చర్యలను సిఫారసు చేసిన సర్వే
Posted On:
22 JUL 2024 2:44PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వే మానసిక ఆరోగ్యం, దాని ప్రాముఖ్యత , విధాన సిఫార్సులపై ప్రభావాల గురించి విస్తృతంగా ప్రస్తావించింది.
మానసిక ఆరోగ్యం - జాతీయ ప్రాబల్యం
వ్యక్తిగత, జాతీయ అభివృద్ధికి మానసిక ఆరోగ్యాన్ని ప్రధాన ప్రభావవంతమైన చోదక శక్తిగా అంగీకరిస్తూ, నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (ఎన్ఎంహెచ్ఎస్) 2015-16 ప్రకారం, భారతదేశంలో 10.6% మంది పెద్దలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, మానసిక రుగ్మతలకు చికిత్స వ్యత్యాసం వివిధ రుగ్మతలకు 70% నుండి 92% మధ్య ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలు (6.9%), పట్టణేతర మెట్రో ప్రాంతాలు (4.3%) తో పోలిస్తే పట్టణ మెట్రో ప్రాంతాల్లో (13.5%) మానసిక రుగ్మతల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఎన్ సి ఇ ఆర్ టి మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ సర్వేను ఉటంకిస్తూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా కౌమారదశలో మానసిక ఆరోగ్యం క్షీణించడం పెరుగుతోందని సర్వే తెలిపింది. 11% మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, 14% మంది తీవ్రమైన ఉద్వేగానికి గురవుతున్నారని , 43% మంది ధోరణి లో ఇట్టిట్టే మార్పులను (మూడ్ స్వింగ్స్) అనుభవిస్తున్నారని పేర్కొంది.
ఆర్థిక కోణాల నుంచి మానసిక ఆరోగ్య సమస్యలు
మొత్తం ఆర్థిక స్థాయిలో, గైర్హాజరు, ఉత్పాదకత తగ్గడం, వైకల్యం, పెరిగిన ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మొదలైన వాటి వల్ల మానసిక ఆరోగ్య రుగ్మతలు గణనీయమైన ఉత్పాదకత నష్టాలతో ముడిపడి ఉన్నాయని సర్వే పేర్కొంది. ఒత్తిడితో కూడిన జీవన పరిస్థితులు, ఆర్థిక అస్థిరత , పైకి ఎదిగే అవకాశాలు లేకపోవడం వల్ల పేదరికం మానసిక ఆరోగ్య ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని కూడా ఆధారాలు ఉన్నాయి, ఇవి మానసిక క్షోభను పెంచడానికి దోహదం చేస్తాయి.
మానసిక ఆరోగ్యాన్ని మొత్తం శ్రేయస్సు కి ప్రాథమిక అంశంగా గుర్తించిన సర్వే, ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న కీలక చొరవలు, విధానాలను వివరించింది.
*జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం: ఈ పథకంలోని జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద 1.73 లక్షలకు పైగా ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పి హెచ్ సి లు, అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మానసిక ఆరోగ్య సేవలను అందించే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా అప్ గ్రేడ్ చేశారు.
*నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్: 20 భాషలలో శిక్షణ పొందిన 1600 మందికి పైగా కౌన్సిలర్లతో, 34 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో 53 టెలీ మానస్ విభాగాలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2022 నుండి 31 మార్చి 2024 నాటికి 8.07 లక్షలకు పైగా కాల్స్ ను నిర్వహించారు.
* మానసిక ఆరోగ్య సిబ్బందిపెంపు: పీజీ విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి 25 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంజూరు, 47 పీజీ విభాగాలను బలోపేతం చేయడానికి 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు/ సంస్థలకు సహకారం, 22 ఎయిమ్స్ ల ద్వారా మానసిక ఆరోగ్య సేవలు, జనరల్ హెల్త్ కేర్ మెడికల్, పారామెడికల్ నిపుణులకు ఆన్ లైన్ శిక్షణ కోర్సులను అందించే మూడు డిజిటల్ అకాడమీల ఏర్పాటు.
*రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం: కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్ లు (ఎఎఫ్ హెచ్ సి), పీర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించారు..
జాతీయ చొరవలకు అదనంగా రాష్ట్ర స్థాయిలో అమలు జరిగిన ప్రత్యేకమైన, స్వతంత్ర చొరవలను కూడా సర్వే ప్రముఖంగా పేర్కొంది. ఈ రాష్ట్ర స్థాయి చొరవలు పిల్లలు , కౌమారదశలో ఉన్నవారి మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు కోసం జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు తోడ్పడుతున్నట్టు సర్వే పేర్కొంది.
మానసిక ఆరోగ్యంపై విధాన సిఫార్సులు
క్షేత్రస్థాయిలో మానసిక ఆరోగ్య సంరక్షణలో చేసిన మెరుగుదలలను వేగవంతం చేయడానికి , వాటి ప్రభావాన్ని పెంచడానికి , ప్రస్తుత కార్యక్రమంలో అంతరాలను పరిష్కరించడానికి సరైన అమలును సర్వే నొక్కి చెప్పింది. కొన్ని ముఖ్యమైన విధాన సిఫార్సులు కింది విధంగా ఉన్నాయి:
-
2021లో ప్రతి లక్ష జనాభాకు 0.75 మంది సైకియాట్రిస్టుల నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణానికి అనుగుణంగా లక్ష జనాభాకు మానసిక వైద్యుల సంఖ్యను మూడు కు పెంచే ప్రయత్నాలను రెట్టింపు చేయడం
-
ఎక్సలెన్స్ సెంటర్ల సేవలతో పాటు మానసిక ఆరోగ్య సంరక్షణ నిపుణులు , యూజర్లు తమ అవసరాలను అర్థం చేసుకోవడానికి సమగ్ర మార్గదర్శకాలను రూపొందించడం
-
వినియోగదారులు, వృత్తి నిపుణులు భాగస్వాముల నుండి ఫీడ్ బ్యాక్ తో కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయడం , విస్తృత జనాభా అవసరాలను తీర్చేలా గణనీయమైన వాటిలో మార్పులు చేయడం
-
పీర్ సపోర్ట్ నెట్ వర్క్ లు, స్వయం సహాయక బృందాలు , కమ్యూనిటీ ఆధారిత పునరావాస కార్యక్రమాలను పెంపొందించడం మొదలైనవి మానసిక రుగ్మతల కుంగుబాటు ను తగ్గించడానికి, తమదనే భావనను పెంపొందించడానికి సహాయ పడతాయి.
-
భవిష్యత్తు విధానాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నాలను పెంచడానికి, విజ్ఞానాన్ని పంచుకోవడానికి , వనరులను ఉపయోగించడానికి మెరుగు పర చ వలసిన అంశాలను గుర్తించడానికి ఎన్ జి ఓ లతో భాగస్వామ్యం.
-
నిర్ణయాలు తీసుకోవడం, సేవా ప్రణాళికలు, సలహా ప్రయత్నాలలో మానసిక ఆరోగ్య సమస్యలతో వ్యక్తిగత అనుభవం ఉన్న వారిని భాగస్వాములను చేయడం ద్వారా మానసిక ఆరోగ్య సేవల వ్యక్తి-కేంద్రీకృత, రికవరీ ఓరియెంటేషన్ ను పెంచవచ్చు.
-
రుగ్మతలను ముందస్తుగా గుర్తించడం కోసం ప్రీస్కూల్, అంగన్ వాడీ స్థాయిలో మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించడం
-
ప్రభుత్వ , ప్రైవేట్ రంగంలో మానసిక-ఆరోగ్య సేవల కోసం కొరకు మార్గదర్శకాల ప్రామాణికీకరణ
-
పాఠశాలల్లో మానసిక ఆరోగ్య జోక్యాలను ఏకీకృతం చేయడానికి ఉపాధ్యాయులు , విద్యార్థులకు వయస్సు-తగిన మానసిక ఆరోగ్య పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయడం, ముందస్తు జోక్యం , సానుకూల భాషను వేగవంతం చేయడం, కమ్యూనిటీ-స్థాయి పరస్పర చర్య.లను ప్రోత్సహించడం , సాంకేతికత పాత్రను సమతుల్యం చేయడం మొదలైనవి సమర్థవంతమైన మార్గాలు.
-
మానసిక ఆరోగ్యం అనే అంశాన్ని పరిష్కరించడం , కళంకాన్ని రూపు మాపడం అనేది మొత్తం సమాజ విధానానికి సంబంధించినది.
-
ప్రజారోగ్య అధికారులు వ్యక్తిగత స్థాయిలో ప్రాథమిక అయిష్టతను గుర్తించడం , పరిష్కరించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పరిష్కరించాలి.
***
(Release ID: 2035454)
Visitor Counter : 283