మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2024కు స్వీయ నామినేషన్ల రిజిస్ట్రేషన్ కు గడువు 2024 జూలై 18వరకు పొడిగింపు.


పూర్తి చేసిన స్వీయ నామినేషన్ను 2024 జూలై 21 లోగా సమర్పించవచ్చు.

Posted On: 16 JUL 2024 7:38PM by PIB Hyderabad

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2024కు, అర్హులైన ఉపాధ్యాయులు తమ స్వీయ నామినేషన్ రిజిస్టర్  చేసుకునేందుకు గడువును 2024 జూలై 18 వరకు పొడిగించారు. దరఖాస్తుదారులుపూర్తి చేసిన తమ దరఖాస్తులను 2024 జూలై 21 లోగా సమర్పించవచ్చు. నామినేషన్లను 2024 జూన్ 27  తేదీనుంచి కేంద్ర విద్యా మంత్రి త్వశాఖ పోర్టల్ http://nationalawardstoteachers.education.gov.in ద్వారా ఆహ్వానించారు.

ఈ ఏడాది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మూడంచెల ఎంపిక ప్రక్రియద్వారా 50 మంది ఉపధ్యాయులను ఎంపిక చేస్తారు. ఈ అవార్డులను 2024 సెప్టెంబర్ 5 వ తేదీన రాష్ట్రపతి , న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.

విద్యామంత్రిత్వశాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల బహుకరణకు జాతీయ స్థాయి ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇందుకు దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులను అత్యంత కఠిన , పారదర్శక, ఆన్ లైన్ విధానంలో ఎంపిక చేస్తారు.  దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులు విద్యారంగానికి అందిస్తున్న సేవలను గుర్తించి వారిని గౌరవించుకోవడం అ జాతీయ టీచర్ల అవార్డు ఉద్దేశం. వీరు తమ చిత్తశుద్ధి, పట్టుదల , పరిశ్రమ ద్వారా పాఠశాల విద్యను మెరుగుపరచడమే కాకుండా, తమ విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేశారు.

అర్హత :

కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు యాజమాన్యాలు, కేంద్ర, రాష్ట్ర బోర్డులకు అనుబంధంగానడుస్తున్న  గుర్తింపు పొందిన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, మాధ్యమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాలల అధిపతులు,

అలాగే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలుఅంటే కేంద్రీయ విద్యాలయాలు (కెవిలు), జవహర్ నవోదయ విద్యాలయాలు (జెఎన్విలు), రక్షణ మంత్రిత్వశాఖ నడిపే సైనిక పాఠశాలలు, అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (ఎఇఇఎస్) నడిపే పాఠశాలలు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నడిపే ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు,

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్య (సిబిఎస్ఇ)కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (సిఐఎస్సిఇ) పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులు , పాఠశాలల అధిపతులు ఈ అవార్డులకు తమ స్వీయ నామినేషన్ను రిజిస్టర్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తును సమర్పించవచ్చు.

***


(Release ID: 2033925) Visitor Counter : 173