హోం మంత్రిత్వ శాఖ

ఇండోర్ లో 'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరు మీద ఒక చెట్టు) ప్రచార కార్యక్రమం (క్యాంపెయిన్) కింద రోజుకు 11 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటిన కేంద్ర హోం , సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


'ఏక్ పేడ్ మా కే నామ్' క్యాంపెయిన్ కింద ఒక్క రోజే 11 లక్షల మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించి, 51 లక్షల చెట్లను నాటే లక్ష్యాన్ని సాధించిన ఇండోర్

'ఏక్ పేడ్ మా కే నామ్' క్యాంపెయిన్ కింద ఒక్క రోజే 11 లక్షల మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించి, 51 లక్షల చెట్లను నాటే లక్ష్యాన్ని సాధించిన ఇండోర్

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది.

నేడు ప్రజలు 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో పాల్గొని చెట్లు నాటడం ద్వారా తమ తల్లులను, మాతృభూమిని గౌరవించుకుంటున్నారు.

పరిశుభ్రత, సుపరిపాలన, సహకారం, యావత్ దేశంలో భాగస్వామ్యానికి పేరు గాంచిన ఇండోర్ నేటి నుంచి 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారం లో కూడా ప్రసిద్ధి పొందుతుంది
మొక్కను బిడ్డలా జాగ్రత్తగా చూసుకోండి, తరువాత అది చెట్టుగా మారినప్పుడు, అది మిమ్మల్ని మీ తల్లిలా చూసుకుంటుంది

ఐదు కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించిన సమయం కంటే ముందే సాధించిన కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సి ఎ పి ఎఫ్) ను అభినందించిన కేంద్ర హోంమంత్ర

Posted On: 14 JUL 2024 6:45PM by PIB Hyderabad

'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరు మీద ఒక చెట్టు) ప్రచారం (క్యాంపెయిన్) కింద మధ్యప్రదేశ్ లోని ఇండోర్ బిఎస్ఎఫ్ క్యాంపస్ లో మొక్కలు నాటడం ద్వారా ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఏక్ పేడ్ మా కే నామ్' క్యాంపెయిన్ కింద ఇండోర్ నేడు 51 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించింది, ఒకే రోజు 11 లక్షల మొక్కలను నాటి ప్రపంచ రికార్డు సృష్టించింది.

 

అంతకుముందు, అమిత్ షా ఇండోర్ లోని పిత్రేశ్వర్ హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. పిత్రేశ్వర్ హనుమాన్ ఆలయం భారతదేశంలోనే కూర్చుని ఉన్న హనుమాన్ ఎత్తయిన విగ్రహం కలిగి ఉంది.

 

శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, ఈ కార్యక్రమం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందుచూపుతో కూడిన ఆలోచన అని, మన తల్లులు , మన భూమాత కోసం చెట్లను నాటాలని, 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో చేరాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారని తెలిపారు. మోదీ ఈ ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని ఎవరూ ఊహించ లేదని శ్రీ షా పేర్కొన్నారు. 'ఏక్ పేడ్ మా కే నామ్' క్యాంపెయిన్ తో ముడిపడి ఉన్న మొక్కలు నాటడం ద్వారా నేడు ప్రజలు తమ తల్లిని, భూమాతను గౌరవిస్తున్నారని ఆయన అన్నారు. పరిశుభ్రత, రుచికరమైన వంటకాలు,సుపరిపాలన,సహకారం ,భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన ఇండోర్ , ఇకపై  'ఏక్ పేడ్ మా కే నామ్' క్యాంపెయిన్ కింద చారిత్రాత్మక చెట్ల పెంపకం కార్యక్రమానికి కూడా గుర్తింపు తెచ్చుకుంటుందని శ్రీ షా అన్నారు. స్మార్ట్ సిటీగా, మెట్రో సిటీగా, క్లీన్ సిటీగా, ఆధునిక విద్యకు కేంద్రంగా పేరొందిన ఇండోర్ ను గ్రీన్ సిటీగా కూడా గుర్తిస్తారని చెప్పారు.

 

 

ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, అధికార యంత్రాంగం ఒక ప్రచారాన్ని ప్రారంభించ గలదు కానీ, విజయవంతం చేయలేదని, అందుకే . రాష్ట్ర ప్రభుత్వం ఇండోర్ నివాసితులందరినీ ఈ ప్రచారంలో భాగస్వామ్యం చేసిందని ఆయన చెప్పారు. ప్రతి వర్గాన్ని , సమాజాన్ని ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయడం ద్వారా తమ మహానుభావుల పేరిట అడవులను సృష్టించాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన ఇండోర్ యువ మేయర్ ను ఆయన అభినందించారు. దీర్ఘకాలం జీవించే మర్రి, వేప, రావి, ఔషధ గుణాలు ఉన్న జామ, మధుకామిని, కరోండ, బెల్పాత్ర, ఉసిరి వంటి చెట్లను కూడా నాటినట్లు తెలిపారు. తొమ్మిది అడవులను నిర్మించే ఈ కాంప్లెక్స్ లో వాటికి సాగునీరు అందించేందుకు మూడు చెరువులను తవ్వే  ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు.

2024 మే నాటికి 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశం లోని అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాలను(సీఏపీఎఫ్) శ్రీ అమిత్ షా ప్రశంసించారు. 2023లో సీఏపీఎఫ్ ఈ లక్ష్యాన్ని చాలా ముందుగానే సాధించిందని చెప్పారు.ఇప్పటివరకు అన్ని సీఏపీఎఫ్ లు 5.2 కోట్ల మొక్కలు నాటాయని, ఈ ఏడాది చివరి నాటికి మరో కోటి మొక్కలు నాటబోతున్నాయని చెప్పారు. చెట్టు ప్రాముఖ్యత గురించి శ్రీ షా మాట్లాడుతూ, మత్స్య పురాణంలో ఒక మెట్టు బావి 10 బావులతో సమానం, ఒక చెరువు 10 మెట్లబావులతో సమానం, ఒక కుమారుడు 10 చెరువులతో సమానం, ఒక చెట్టు 10 మంది కుమారులతో సమానం అని పేర్కొన్నారని, మొక్కలు పెరిగే వరకు  మనం వాటిని చిన్నపిల్లల మాదిరి చూసుకుంటే అవి పెద్దయ్యాక మనల్ని  తల్లిలా చూసుకుంటాయని అన్నారు. 

 

మన భవిష్యత్ తరాల కోసం మనం ఆలోచించవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారని,  ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తీరుతో నేడు భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై ఆందోళన నెలకొందని అన్నారు. వాతావరణ కాలుష్యానికి ప్రధాని మోదీ ప్రారంభించిన 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారమే సరైన సమాధానం అన్నారు. మధ్యప్రదేశ్ మొత్తం వైశాల్యంలో 31% అటవీ ప్రాంతాన్ని కలిగి ఉందని, ఇది యావత్ భారతదేశానికి ఆక్సిజన్ ను అందించడానికి ఉపయోగపడుతుందని శ్రీ షా అన్నారు.  దేశంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 12 శాతం మధ్యప్రదేశ్ లో ఉందని, ఇది పర్యాటక రంగానికి కూడా ఊతమిచ్చిందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ లో 6 టైగర్ రిజర్వ్ లు, 11 నేషనల్ పార్కులు, 24 అభయారణ్యాలు ఉన్నాయని, ప్రధాని మోదీ ఇప్పుడు కునో టైగర్ రిజర్వ్ కు చిరుతలను కూడా తీసుకువచ్చారని, ఇది మన పర్యావరణానికి మేలు చేస్తుందని ఆయన అన్నారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ వంటి అనేక కార్యక్రమాలను ప్రధాని మోదీ జి-20లో తీసుకున్నారని, దీని కారణంగా ఐక్యరాజ్యసమితి మోదీజీని ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డుతో సత్కరించిందని శ్రీ షా అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక జాతీయ స్థాయి కార్య క్రమాలను చేపట్టినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. పెట్రోల్, డీజిల్ లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కు అనుమతిచ్చామని, 2025 నాటికి భారతదేశం అంతటా పెట్రోల్, డీజిల్ లో 20 శాతం మిశ్రమం ఉంటుందని ఆయన చెప్పారు. వీటితో పాటు బయోమాస్ ను జీవ ఇంధనంగా మార్చేందుకు 12కు పైగా రిఫైనరీలను ఏర్పాటు చేశామని, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద రూ.20 వేల కోట్లతో ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేశామని చెప్పారు.వీటితో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గోవర్ధన్ స్కీమ్, నేషనల్ అడాప్షన్ ఫండ్ ఫర్ క్లైమేట్ ఛేంజ్ ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ముందుచూపుతో ప్రారంభించారని తెలిపారు.

 

శ్రీ నరేంద్ర మోదీ మూడవసారి దేశ ప్రధాన మంత్రి అయ్యారని, ఆయన నాయకత్వంలో దేశం సురక్షితంగా, సుసంపన్నంగా, ఆధునికంగా , ప్రపంచంలోని ప్రతి రంగంలో మొదటి స్థానంలో ఉంటుందని మనందరికీ తెలుసునని కేంద్ర హోం మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ కు కూడా ఎంతో ఘనత దక్కుతుందని,మధ్యప్రదేశ్ లో శ్రీ మోహన్ యాదవ్ జీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని శ్రీ షా అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ ఇటీవల 3 లక్షల 65 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టారని, ఇది ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో అతిపెద్ద బడ్జెట్  అని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ బడ్జెట్ అభివృద్ధి, రైతు సంక్షేమం మధ్య సమతుల్యతను తీసుకువచ్చే అవకాశం ఉందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

***



(Release ID: 2033540) Visitor Counter : 23