ప్రధాన మంత్రి కార్యాలయం
తిరు కె. కామరాజ్ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
15 JUL 2024 4:57PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరు కె. కామరాజ్ జయంతి సందర్భం గా ఆయనకు శ్రద్ధాంజలిని సమర్పించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :
‘‘తిరు కె. కామరాజ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకొంటున్నాను. ఆయన తన దూరదర్శి నాయకత్వానికి గాను, పేదల అభ్యున్నతికి తాను చేసిన ప్రయాసలకు గాను విస్తృత గౌరవానికి పాత్రులు అవుతున్నారు. విద్య వంటి రంగాలకు ఆయన అందించిన తోడ్పాటు సాటి లేనిది. మనం ఆయన ఆదర్శాలను నెరవేర్చడానికి, న్యాయ పూర్ణమైన సమాజాన్ని, ఉదారమైన సమాజాన్ని ఆవిష్కరించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటించుదాం.’’
********
DS/ST
(Release ID: 2033530)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam