వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ చేతివృత్తులవారికి అండగా నిలవండి, ప్రపంచవ్యాప్తంగా బాలల్లో స్ఫూర్తిని కలిగించే, వారిని చైతన్యవంతులను చేసే ఆటబొమ్మల ద్వారా సృజనాత్మకతను, కల్పనశీలత్వాన్ని పెంచి పోషించండి: శ్రీ జితిన్ ప్రసాద


డిపిఐఐటి, ఇన్వెస్ట్ ఇండియా ల సహకారంతో రెండో ‘టాయ్ సిఇఒ మీట్’ను నిర్వహించిన భారతీయ ఆటబొమ్మల సంఘం

భారతదేశ ఆటబొమ్మల పరిశ్రమకు, ప్రపంచ ఆటబొమ్మల పరిశ్రమకు మధ్య సహకారాన్ని ప్రోత్సహించే ‘టాయ్ సిఇఒ మీట్’



Posted On: 10 JUL 2024 1:40PM by PIB Hyderabad

భారతదేశంలో చేతివృత్తులవారికి అండగా నిలవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో ప్రేరణను కలిగించేవారికి చైతన్యాన్ని అందించే ఆటబొమ్మల మాధ్యమం ద్వారా సృజనాత్మకతను, కల్పనశీలత్వాన్ని పెంచి పోషించాలని వాణిజ్యంపరిశ్రమలుఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతికత శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ఆటబొమ్మల తయారీ పరిశ్రమ కు సూచించారు.  డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రి ఎండ్  ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి)ఇన్వెస్ట్ ఇండియా ల సహకారంతో టాయ్ సిఇఒ మీట్ రెండో సంచిక’ కార్యక్రమాన్ని 2024 జులై 8వ తేదీన న్యూ ఢిల్లీ లో భారతీయ ఆటబొమ్మల సంఘం నిర్వహించగా  ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొనికీలకోపన్యాసం చేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్సబ్ కా విశ్వాస్’’ దార్శనికతను గురించి మంత్రి తన ప్రసంగం లో ప్రముఖంగా ప్రస్తావించారు.  కార్యక్రమం లో పాల్గొన్న వారు సహకారాన్ని కొనసాగించాలని, భారతదేశ ఆటబొమ్మల తయారీ వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకుపోవాలని మంత్రి సూచించారు.

 

భారతదేశాన్ని ఒక గ్లోబల్ టాయ్ హబ్ గా నిలిపే విశిష్ట కార్యాన్ని సాధించే దిశలో ముందుకు పోవాలనే లక్ష్యంతో, భారతదేశ ఆటవస్తువుల తయారీ పరిశ్రమకుప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటవస్తువుల తయారీ పరిశ్రమకు మధ్య సమన్వయానికి ఒక వేదికను ‘టాయ్ సిఇఒ మీట్ రెండో సంచిక’ అందించింది.  ఈ కార్యక్రమంలో వాల్ మార్ట్అమెజన్స్పిన్ మాస్టర్ఐఎమ్ సి టాయస్ వంటి ప్రముఖ ప్రపంచ ఆటవస్తువుల తయారీ సంస్థలతో పాటు సన్ లార్డ్ అపేరల్స్ మేన్యుఫేక్చరింగ్  కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ప్లేగ్రో టాయస్ ఇండియా ప్రైవేట్  లిమిటెడ్ లు సహా దేశీయ ఆటవస్తువుల పరిశ్రమలోని సభ్యులు కూడా పాలుపంచుకొన్నాయి.

 

 

కార్యక్రమం లో పాల్గొన్న వారిని ఉద్దేశించి డిపిఐఐటి కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ప్రసంగిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు, దేశీయ తయారీదారు సంస్థలు చేస్తున్న కృషి ఫలితంగా భారతదేశంలో ఆటవస్తువుల తయారీ పరిశ్రమ ప్రశంసాయోగ్యమైన వృద్ధిని సాధించగలిగిందన్నారు.  ఈ వికాసం భారతదేశం స్వయం సమృద్ధి అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండడాన్ని, ఆట వస్తువుల తయారీలో సామర్థ్యం అధికమవుతూ ఉండడాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు. 

 

 

డిపిఐఐటి సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ మాట్లాడుతూభారతదేశ ఆటవస్తువుల పరిశ్రమ చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యేకించి‘పదిహేనో టాయ్ బిజ్ ఇంటర్ నేషనల్ బి2బి ఎక్స్ పో’ ను విజయవంతంగా నిర్వహించినందుకుగాను భారతీయ ఆటడొమ్మల సంఘం చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు.  ఆట వస్తువుల పరిశ్రమ సభ్యులు ఏవైనా సవాళ్ళు ఎదురైన పక్షంలో డిపిఐఐటి  దృష్టికి తీసుకురావాలని, భారతదేశంలో తయారయ్యే ఆటబొమ్మలు నాణ్యతకుఅద్వితీయతకువినూత్నత్వానికిమన్నికకు మారుపేరుగా ఉండేటట్లు చూడటమే కర్తవ్యమని ఆయన అన్నారు.

 

 

ఆట బొమ్మల తయారీకి భారతదేశంలో ఉన్న పెట్టుబడికి అవకాశాలను గురించి ఇన్వెస్ట్ ఇండియా సిఇఒఎమ్‌డి నివృత్తి రాయ్ చర్చించారు.   పిల్లల జన సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ పెట్టుబడి కి గిరాకీ కూడా పెరుగుతుందని, ఈ కారణం గా భారతదేశం లో పెట్టుబడికి చాలా పెద్ద మార్కెట్టు ఏర్పడుతుందని ఆమె అన్నారు.

 

 

స్టేక్ హోల్డర్స్ తో చర్చ సాగిన క్రమంలో వాల్ మార్ట్, ఐఎమ్‌సి టాయస్స్పిన్ మాస్టర్ వంటి ప్రపంచ ఆటవస్తువుల రంగం లోని దిగ్గజాలు వారి వారి సంస్థల వృద్ధి గాథలను గురించి వివరించారు.  భారతదేశం లో కార్యకలాపాలను విస్తరించాలని వారు ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.  సభలో మాట్లాడిన వారు చెప్పిన వివరాలను బట్టి, భారతదేశంలో ఆటవస్తువుల పరిశ్రమ లోలోపలి అంశాలు, వృద్ధికిసహకారానికి ఉన్న అవకాశాలు ఏమిటనేవి శ్రోతలకు తెలిసి వచ్చాయి.  భారతదేశ ఆట వస్తువుల తయారీ పరిశ్రమకు ప్రపంచ విపణిలో  అందివచ్చే అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలోభారతదేశానికి ఉన్న సామర్థ్యాలను సాటి దేశాలతో కలబోసుకొంటూ ముందడుగులు వేయడంలోకొత్తగా ఉనికి లోకి వస్తున్న అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఈ కార్యక్రమం ఒక కీలకమైన పాత్రను పోషించింది.

 

 

ఈ కార్యక్రమాన్ని దేశంలో అతి పెద్దదైన ఆటబొమ్మల మేళాలలో ఒకటైన ‘ఇండియా టాయ్ బిజ్ ఇంటర్ నేషనల్ బి2బి ఎక్స్ పో పదిహేనో సంచిక’లో ఒక భాగంగా నిర్వహించడమైంది.  ఈ కార్యక్రమం దేశీయ ఆటబొమ్మల తయారీ రంగంలో నానాటికీ పెచ్చుపెరుగుతున్న అవకాశాలను సద్వినియోగ పరచుకోవడం కోసం ప్రపంచంలోని ప్రముఖ ఆట వస్తువుల తయారీదారు సంస్థలను, దేశం లోని ఆట వస్తువుల తయారీదారు సంస్థలనుచేతివృత్తులవారినిరిటేలర్లనుప్రభుత్వ అధికారులను ఒక చోటికి చేర్చింది.

 

***


(Release ID: 2032281) Visitor Counter : 81