ప్రధాన మంత్రి కార్యాలయం

ఉన్నావ్ లో జరిగిన రహదారి ప్రమాదం పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; బాధితులకు పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు

Posted On: 10 JUL 2024 10:45AM by PIB Hyderabad

ఉన్నావ్ లో జరిగిన రహదారి దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పరిపాలన యంత్రాంగం బాధితులకు చేతనైన అన్ని విధాలుగాను సహాయం చేయడంలో నిమగ్నం అయిందంటూ ఆయన హామీని ఇచ్చారు.

 

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ మాధ్యమం లో పొందుపరచిన ఒక సందేశం లో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత బాధాకరమైంది.  ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వ్యక్తులకు ఇదే నా సంతాపం.  వారికి ఈ కఠిన కాలంలో ఓర్పుగా ఉండే శక్తిని ఆ ఈశ్వరుడు ప్రసాదించు గాక.  ఈ దుర్ఘటనలో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు అవ్వాలని కోరుకుంటున్నాను.  రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో స్థానిక పాలన యంత్రాంగం బాధితులకు అన్ని విధాలుగాను సహాయం చేయడంలో నిమగ్నమైంది: ప్రధాన మంత్రి శ్రీ@narendramodi’’ అని తెలిపింది.

 

 

ఉన్నావ్ లో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.  ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పింఒ) ఎక్స్ మాధ్యమం లో పొందుపరచిన ఒక సందేశం లో -

‘‘ఉన్నావ్ దుర్ఘటనలో మరణించిన ప్రతి వ్యక్తి కి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని వారి దగ్గరి బంధువులకు చెల్లించడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.  ఈ దుర్ఘటనలో గాయపడ్డ వ్యక్తులకు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది’’ అని తెలిపింది.



(Release ID: 2032131) Visitor Counter : 30