కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర 2024 కోసం టెలికాం సదుపాయాలను మెరుగుపరిచిన టెలికమ్యూనికేషన్స్ విభాగం
నిరంతరాయ మొబైల్ కనెక్టివిటీని అందించేందుకు గానూ యాత్ర జరిగే దారుల్లో 31 కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయడంతో 82కు పెరిగిన మొత్తం కేంద్రాలు యాత్రికులకు టెలికాం సదుపాయాలను కల్పించేందుకు గానూ సిమ్ కార్డుల పంపిణీ కేంద్రాలు ప్రారంభం లఖన్‌పూర్ నుంచి ఖాజిగండ్, ఖాజిగండ్ నుంచి పహల్‌గామ్, బల్తల్ వరకు దారులు మొత్తం మొబైల్ నెట్‌వర్క్ ఏర్పాటు.. అనేక ప్రాంతాల్లో అందుబాటులోకి 5జీ సాంకేతికత
Posted On:
08 JUL 2024 12:11PM by PIB Hyderabad
శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర 2024లో పాల్గొంటున్న భక్తులకు నిరంతరాయ మొబైల్ కనెక్టివిటీ ఉండేలా చూసేందుకు గానూ టెలికాం సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) ప్రకటించింది. ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, రిలయెన్స్ జియో తదితర అన్ని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల(టీఎస్‌పీ)ల సహకారంతో యాత్ర కొనసాగే దారుల్లో నిరంతరాయ నెట్‌వర్క్ ఉండేలా టెలికాం సదుపాయాలను అభివృద్ధి చేశారు.
పెరిగిన కనెక్టివిటీ:
- మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యంతో మొత్తం 82 కేంద్రాలు(ఎయిర్‌టెల్, ఆర్‌జీఐఎల్, బీఎస్ఎన్ఎల్) నిర్వహణలో ఉంటాయి. వీటికి సంబంధించిన కీలక ప్రదేశాలు కింది పట్టికలో ఉన్నాయి.
- యాత్ర కొనసాగే దారుల్లో 31 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడంతో మొత్తం కేంద్రాల సంఖ్య 2023లో 51 ఉండగా 2024లో 82కు పెరిగాయి. భక్తులకు, ప్రజలకు నిరంతరాయ మొబైల్ కనెక్టివిటీని కల్పించే లక్ష్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- లఖన్‌పూర్ నుంచి ఖాజిగండ్ వరకు, ఖాజిగండ్ నుంచి పహల్‌గామ్, బల్తల్ వరకు పూర్తిస్థాయిలో 2జీ, 3జీ, 4జీతో పాటు చాలా ప్రాంతాల్లో భక్తులు, ప్రజలకు 5జీ సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చింది.
- యాత్రికులకు టెలికాం సదుపాయాలు మెరుగుపరిచేందుకు గానూ కొన్ని కీలక ప్రాంతాల్లో సిమ్ కార్డుల పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. దిగువన ఈ కేంద్రాల జాబితా చూడొచ్చు.
ప్రాంతం
|
లఖన్‌పూర్
|
యాత్రి నివాస్ భగవతి నగర్
|
చందర్‌కోట్
|
అనంత్‌నాగ్
|
శ్రీనగర్
|
శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్
|
పహల్‌గామ్
|
సోన్‌మార్గ్
|
బల్తల్
|
శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర 2024 సందర్భంగా నిరంతరాయ మొబైల్ సేవలు అందించేందుకు గాను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు(టీఎస్‌పీ) కింద పేర్కొన్న బేస్ ట్రాన్సీవర్ స్టేషన్(బీటీఎస్)లను ఏర్పాటుచేశాయి:
ఆపరేటర్-లొకేషన్ కనెక్టివిటీ సైట్స్ మార్కింగ్
|
బేస్ క్యాంపు(పహల్‌గామ్, బల్తల్) నుంచి పవిత్ర గుహ వరకు
|
ఆపరేటర్
|
సైట్లు(ప్రాంతాలు)
|
ఎయిర్‌టెల్
|
19 సైట్ల(సోన్‌మార్గ్, నిల్‌గ్రత్ ఆర్మీ క్యాంప్, బల్తల్-1, బల్తల్-2, దొమైల్-1, దొమైల్-2 ఆర్మీ క్యాంపు, రైల్ పత్రి, బురారి, సంగం, పవిత్ర గుహ, పంచ్‌తరణి, పోష్‌పత్రి, శేష్‌నాగ్, చందన్‌బారి, నున్‌వాన్ బేస్ క్యాంపుతో పాటు యాత్ర దారుల్లో ఉన్న వివిధ యాత్రి నివాస్‌లు)లో 2జీ, 4జీ, 5జీ కవరేజీ ఉంది.
|
బీఎస్ఎన్ఎల్
|
27 బీటీఎస్‌ల(రంగ్‌మోర్హ్, బల్తల్, దొమైల్ చెక్‌పోస్ట్, దొమైల్, రైల్ పత్రి-2, బరారి, వై-జంక్షన్, సంగం, పవిత్ర గుహ, పంచ్‌తరణి, కెల్నర్-2, కెల్నర్-2, పోష్‌పత్రి, మహాగున శిఖరం, వబల్, శేష్‌నాగ్, నాగకోటి, జోజిబల్-1, జోజిబల్-2, పిసు శిఖరం, చందన్‌వారి, పహల్‌గామ్, నున్వాన్ బేస్ క్యాంపుతో పాటు యాత్ర కొనసాగే దారుల్లో ఉన్న వివిధ యాత్రి నివాస్‌లు)లో 2జీ, 3జీ, దేశీయ 4జీ కవరేజీ ఉంది.
|
ఆర్‌జేఐఎల్
|
36 సైట్ల(గన్సిబల్ పహల్‌గామ్, నున్వన్ బేస్ క్యాంపు, పహల్‌గామ్ బస్ స్టాండ్, పహల్‌గామ్ మార్కెట్, పహల్‌గామ్ లిడ్డర్ పార్క్, సర్క్యూట్ రోడ్డు, లాలిపొర, లాలిపొర ఈఎస్‌సీ, బెతబ్ బ్యాలీ, చందన్‌వారి, చందన్‌వారి పహల్‌గామ్, పిసు శిఖరం, జోజిబల్, శేష్‌నాగ్ క్యాంపు, శేష్‌నాగ్ పహల్‌గామ్, మహాగుణ పాస్, పోష్‌పత్రి, పంచతరణి-1, పంచతరణి-2, సంగం శిఖరం, పవిత్ర గుహ పహల్‌గామ్ ఈఎస్‌సీ, పవిత్ర గుహ పహల్‌గామ్, బరారిమార్గ్, రైల్ పత్రి, దొమైల్ క్యాంపు, దొమైల్, బల్తల్ బేస్ క్యాంపు-1,2,3,4, పరిబల్ కంగన్, నిల్‌గ్రత్ సోనామార్గ్, సోనామార్గ్ కొత్త ట్రక్ యార్డు, సోనామార్గ్ ప్రధాన మార్కెట్, సోనామార్గ్ రోడ్డు)లో 4జీ, 5జీ(30 ప్రాంతాల్లో 4జీ, 5జీ; 06 ప్రాంతాల్లో 4జీ) కవరేజీ ఉంది.
|
అధునాతన టెలికాం సాంకేతికతలను అందించడం ద్వారా శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర 2024లో పాల్గొనే అందరికీ సులువైన, మంచి అనుభవాన్ని అందించేందుకు డీఓటీ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2031578)
|