ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ము- కశ్మీర్ లోని శ్రీనగర్ లో యోగ సాధకులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 21 JUN 2024 11:37AM by PIB Hyderabad

మిత్రులారా,

ఈ రోజున, ఈ దృశ్యం  ప్రపంచంలోని మానవులందరి మనస్సులలో శాశ్వతంగా నిలచివుంటుంది. వర్షం వచ్చినప్పటికీ కూడాను దీనికి లభించిన ఇంతటి మంచి ఆదరణ ను పట్టి చూస్తే ఒకవేళ వాన కురవకపోయిఉండి వుంటే ఈ కార్యక్రమం ఇంతగా గమనిక లోకి రాకపోయివుండి ఉండేదేమోననిపిస్తుంది. మరి శ్రీనగర్ లో వర్షం పడిందా అంటే, చలి కూడా పెరిగిపోతుందాయె. నేను స్వయంగా ఒక చలిబనీను ను వేసుకోవలసి వచ్చింది. మీరంటే ఇక్కడి వారు కాబట్టి మీకు ఇదంతా అలవాటుగా ఉంటుంది. ఇది మీకు ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. ఏమైనా, వాన పడినందువల్ల, కాస్తంత జాప్యం జరిగింది. మరి మనం ఈ కార్యక్రమాన్ని రెండు లేదా మూడు భాగాలు గా విడదీయవలసివచ్చింది. ఇంత జరిగినా, వ్యక్తి కి మరియు సమాజానికి యోగ ఎంత ముఖ్యమైందో, యోగ ఏ విధం గా జీవనంలో ఓ స్వాభావికమైన భాగమో ప్రపంచ సముదాయం అర్థం చేసుకొంటుంది. పళ్లు తోముకోవడం, తల దువ్వుకోవడం మీ నిత్య కృత్యాలు అయిపోయినట్లుగానే, అంతే సులువుగా యోగ మీ జీవనం లో ఓ భాగం గా మారిపోయిందా అంటే గనక అది ప్రతి క్షణమూ మీకు లాభాలను అందిస్తుంది.

 

 

ఒక్కొక్కసారి, యోగ ల ఒక భాగం గా ఉన్న  ధ్యానం విషయానికి వస్తే, చాలా మంది దానిని ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం అని అనుకుంటారు. అది అల్లాహ్ ను, దైవాన్ని, లేదా ఒక దివ్య దృష్టి ని పొందడం తో సంబంధం ఉన్నది అని వారు అనుకుంటారు.  ‘‘ఓహ్, నేను దీనిని చేయలేను, ఇది నా శక్తి కి మించింది’’ అని ఆగిపోయే వారు కూడా కొంత మంది ఉంటారు. అయితే ధ్యానాన్ని మనం సీదాసాదా నిబంధనలలో అర్థం చేసుకొన్నామా అంటే గనక అది ఏకాగ్రత ను గురించి చెబుతుంది. బడి లో మన టీచర్లు మనకు మీ దృష్టి ని కేంద్రీకరించండి, పరిశీలించి చూడండి, ఇంకా శ్రద్ధ గా వినండి అని తరచుగా చెప్పినట్లుగా అన్నమాట. ‘‘మీ దృష్టి ఎక్కడుంది?’’ అని వారు మనతో పదే పదే అంటూ ఉంటారు. ఈ ధ్యానం అనేది ఉంది చూశారూ, ఇది మన కేంద్రీకరణానికి సంబంధించిన అంశం; విషయాల పట్ల మనం ఎంతగా దృష్టి పెడుతున్నాం, మన మనస్సు ఎంతటి శ్రద్ధ తో ఉంది అనేవి.  

 

చాలా మంది జ్ఞ‌ాపక శక్తి ని పెంచుకోవడం కోసం కొన్ని ప్రత్యేక పద్ధతులను అలవరచుకొంటూ ఉండడాన్ని మీరు గమనించి ఉండవచ్చు.  వారు అలాంటి ప్రత్యేక పద్ధతులను గురించి ఇతరులకు కూడా నేర్పుతూ ఉంటారు. వాటిని సరిగా అనుసరించే వ్యక్తులు క్రమంగా వారి ధారణశక్తిని పెంచుకొంటారు. ఇదే మాదిరిగా, ఏదైనా పని మీద శ్రద్ధ తీసుకోవడం, ఆ పని పైన దృష్టిని కేంద్రీకరించడం, ఏకాగ్రతతో పనిచేయడం ఉత్తమ ఫలితాలను ఇచ్చి, స్వీయ అభివృద్ధికి తోడ్పడుతుంది; కనీసమైన అలసటతో గరిష్టమైన సంతృప్తిని ఇస్తుంది.

 

ఒక పని ని చక్కబెడుతున్నప్పుడు మనస్సు పది విషయాల మీదకు పోయిందా అంటే అది అలుపును కలిగిస్తుంది. అందుకనే, మీరు ధ్యానం పైన దృష్టిని కేంద్రీకరించాలి. మీ ఆధ్యాత్మిక పయనాన్ని ఇక కొంతసేపున పక్కన పెట్టేయండి. మిమ్మల్ని మీరు కేంద్రీకరించుకోవడానికి, మీ వ్యక్తిగత జీవనం పైన దృష్టి సారించడానికి, శ్రద్ధను తీసుకోవడానికి మీకు మీరు ఇచ్చుకొనే శిక్షణ లో యోగ ఇప్పుడు ఒక భాగంగా ఉంది. దీనితో మీరు సులభం గా జట్టుకట్టారా అంటే, మిత్రులారా, మీరు ఎంతగానో లాభపడుతారు, ఇంకా, ఇది మీ ప్రగతి యాత్ర లో ఓ బలమైన అంశం గా తప్పక మారిపోతుంది అని నేను నమ్ముతున్నాను.

 

ఇలాగ, యోగ అనేది ఏ వ్యక్తి కి అయినా అవసరమూ, ఉపయోగకరమూను. ఇది ఆ వ్యక్తి కి బలాన్ని ఇస్తుంది. అంతేకాక సమాజానికి కూడా ఇది మేలును చేకూర్చుతుంది. సమాజం లాభపడినప్పుడు మానవ జాతి లాభపడుతుంది, ప్రపంచంలోని ప్రతి చోటా ప్రజలు లాభపడుతారు.  

 

రెండు రోజుల కిందట, ఈజిప్టు లో నిర్వహించిన ఒక పోటీ తాలూకు వీడియోను నేను చూశాను. ప్రముఖ పర్యటక కేంద్రాలలో తీసిన ఉత్తమ యోగ ఫొటో కో, వీడియో కో వారు పురస్కారాన్ని అందించారు. నేను చూసిన ఫొటోలలో, ప్రసిద్ధి చెందిన పిరమిడ్ లకు సమీపంలో ఈజిప్టు వాసులు యోగాఆసనాలను సాధన చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. అవి ఎంతో మనోరంజకంగా ఉన్నాయి. కశ్మీర్ విషయానికి వస్తే, ఇది ప్రజలకు ఉద్యోగకల్పన లో ఒక ముఖ్య మార్గం కాగలదు. పర్యటక రంగానికి ఇది ఒక ప్రధానమైన ఆకర్షణ కాగలదు.

 

ఈ కారణంగా, నేను ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నాను.  చలి వేస్తున్నా గాని, వాతావరణం సవాళ్లను రువ్వుతున్నా గాని మీరు ధైర్యం గా ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు వాన నుంచి వారిని వారు కాపాడుకోవడానికి వారి యోగ చాపలను ఉపయోగించారు తప్ప ఈ ప్రదేశాన్ని వీడి వెళ్లలేదు, వారు ఇక్కడే ఉన్నారు. ఇది గొప్ప సంగతే.

 

మీకు అందరికి ఇవే నా అభినందనలూ, శుభాకాంక్షలూను.

మీకు ఇవే ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి భావానువాదం. ప్రధాన మంత్రి హిందీ భాష లో ప్రసంగించారు.

 

**



(Release ID: 2031015) Visitor Counter : 9