పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడడంతో, ముగిసిన పార్లమెంట్ సమావేశాలు


ప్రమాణం/ప్రతిజ్ఞ తీసుకున్న 539 కొత్తగా ఎన్నికైన సభ్యులు

రెండు సభలు 100 శాతం పైగా తగు వినియోగం

రెండు సభలు 100 శాతం పైగా తగు వినియోగం

Posted On: 03 JUL 2024 5:18PM by PIB Hyderabad

18వ  లోక్‌సభకు సాధారణ ఎన్నికల తర్వాత, లోక్‌సభ మొదటి సెషన్, 264వ రాజ్యసభ సెషన్‌లు వరుసగా జూన్ 24, 27 తేదీలలో వరుసగా సమావేశం ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ నిన్న, 2 జూలై, 2024న వాయిదా పడింది. రాజ్యసభ ఈరోజు 3 జూలై, 2024న వాయిదా పడింది.

న్యూఢిల్లీలో ఈరోజు విలేకరుల సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ పార్లమెంట్ సమావేశాల వివరాలను వెల్లడించారు. లోక్‌సభలో మొదటి రెండు రోజులు 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం/ప్రతిజ్ఞ కోసం ప్రత్యేకంగా కేటాయించారని, సెషన్‌లో మొత్తం 542 మంది సభ్యులలో 539 మంది ప్రమాణం/ప్రతిజ్ఞ చేసారని ఆయన వెల్లడించారు. 

 

ప్రమాణం/ప్రతిజ్ఞ సులభతరం కోసం, భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ప్రొటెం స్పీకర్‌గా శ్రీ భర్తృహరి మెహతాబ్‌ను రాష్ట్రపతి నియమించారు.  శ్రీ సురేష్ కోడికున్నిల్, శ్రీ రాధా మోహన్ సింగ్, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీ టి.ఆర్. బాలు, శ్రీ సుదీప్ బందోపాధ్యాయ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 99 కింద సభ్యులు ప్రమాణం/ధృవీకరణను చేసే మరియు సభ్యత్వం పొందే వ్యక్తులు.

జూన్ 26, 2024న, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగింది.  లోక్‌సభ సభ్యుడు శ్రీ ఓం బిర్లా మూజువాణి ఓటు ద్వారా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అదే రోజు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్‌సభకు తన మంత్రిమండలిని పరిచయం చేశారు.

 

2024 జూన్ 27న, సమావేశమైన పార్లమెంట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 కింద ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు, ప్రభుత్వం గతంలో సాధించిన విజయాల వివరాలను తెలియజేస్తూ, దేశ భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను కూడా వివరించారు.

జూన్ 27, 2024న, ప్రధానమంత్రి తన మంత్రిమండలిని రాజ్యసభకు పరిచయం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ 28 జూన్ 2024న ఉభయ సభల్లో ప్రారంభం కావాల్సి ఉంది. లోక్‌సభలో, అంతరాయాల కారణంగా, ఈ అంశంపై చర్చ 1 జూలై 2024న మాత్రమే ప్రారంభం అయింది. లోక్ సభలో ఎంపీ శ్రీ అనురాగ్ ఠాకూర్, చర్చను ప్రారంభించగా, ఎంపీ ఎం. బన్సూరి స్వరాజ్, చర్చను బలపరిచారు. మొత్తం 68 మంది సభ్యులు చర్చలో పాల్గొనగా, 50 మందికి పైగా సభ్యులు తమ ప్రసంగాలను సభ టేబుల్‌పై ఉంచారు అంటే సభకు సమర్పించారు. జూలై 2, 2024న 18 గంటలకు పైగా చర్చ జరిగిన తర్వాత ప్రధానమంత్రి చర్చకు సమాధానమిచ్చారు. లోక్‌సభలో దాదాపు 34 గంటలపాటు 7 సిట్టింగ్‌లు జరిగాయి. ఒక రోజు పూర్తిగా పోయినప్పటికీ ఉత్పాదకత 105 శాతం ఉంది.

రాజ్యసభలో, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను ఎంపీ శ్రీ సుధాంశు త్రివేది ప్రారంభించారు, దీనిని 28 జూన్ 2024న ఎంపీ శ్రీమతి కవితా పాటిదార్ బలపరిచారు. మొత్తం 76 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. 3 జూలై, 2024న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనికి 21 గంటల కంటే ఎక్కువ సమయం ఇచ్చారు. రాజ్యసభ మొత్తం ఉత్పాదకత 100 శాతం పైగా ఉంది.

***


(Release ID: 2030611) Visitor Counter : 133