రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూన్ 2024 లో 135.46 మెట్రిక్ టన్నుల సరుకు లోడింగ్‌ను సాధించిన భారత రైల్వే


గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.40 మెట్రిక్ టన్నులు పెరిగిన సరుకు లోడింగ్


2024 జూన్‌లో సరుకు రవాణా ద్వారా రైల్వేకు ఆదాయం రూ.14798.11 కోట్లు.


గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.1481.29 కోట్లు పెరిగిన సరుకు రవాణా ఆదాయం

Posted On: 02 JUL 2024 5:07PM by PIB Hyderabad

2024 జూన్ నెలలో 135.46 మెట్రిక్ టన్నుల సరుకు లోడింగ్ భారత రైల్వే సాధించింది. ఈ విషయంలో జూన్ 2023లో సాధించిన 123.06 మెట్రిక్ టన్నులతో పోల్చితే 10.07 శాతం వృద్ధి నమోదు చేసింది.  2023 జూన్‌లో సరుకు రవాణా ఆదాయం రూ.13,316.81 కోట్లు కాగా.. దీనితో పోల్చితే 11.12 శాతం వృద్ధితో 2024 జూన్‌లో రూ.14,798.11 కోట్ల సరుకు రవాణా ఆదాయం పొందింది.

బొగ్గులో 60.27 మెట్రిక్ టన్నులు (దిగుమతి చేసుకున్న బొగ్గు మినహా), దిగుమతి చేసుకున్న బొగ్గులో 8.82 మెట్రిక్ టన్నులు, ఇనుప ఖనిజంలో 15.07 మెట్రిక్ టన్నులు, పిగ్ ఐరన్ & అంతిమ స్టీల్‌లో 5.36 మెట్రిక్ టన్నులు, సిమెంట్‌లో 7.56 మెట్రిక్ టన్నులు(క్లింకర్ మినహా), క్లింకర్‌లో 5.28 మెట్రిక్ టన్నులు, ఆహారధాన్యాలలో 4.21 మెట్రిక్ టన్నులు, ఎరువులలో 5.30 మెట్రిక్ టన్నులు, మినరల్ ఆయిల్‌లో 4.18 మెట్రిక్ టన్నులు, కంటైనర్లలో 6.97 మెట్రిక్ టన్నులు, ఇతర వస్తువుల్లో 10.06 మెట్రిక్ టన్నుల లోడింగ్‌ను భారత రైల్వే జూన్ 2024లో సాధించింది. 

 

***

 

"హంగ్రీ ఫర్ కార్గో" అనే మంత్రాన్ని అనుసరించి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, పోటీ ధరల వద్ద సేవలను మెరుగుపరచటానికి భారత రైల్వే నిరంతర ప్రయత్నాలు చేసింది. చురుకైన విధాన రూపకల్పన మద్ధతుతో వినియోగదారు కేంద్రీకృత విధానం, వ్యాపారాభివృద్ధి యూనిట్‌ల పని.. భారత రైల్వే ఈ మైలురాయిని అందుకునేందుకు ఉపయోగపడ్డాయి.


(Release ID: 2030340) Visitor Counter : 68