సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కుటుంబ పింఛను ఫిర్యాదుల పరిష్కారం కోసం పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ(డీఓపీపీడబ్ల్యూ) చేపట్టనున్న ప్రత్యేక క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


దేశ నిర్మాణంలో పింఛనుదారులు భాగస్వాములని, సమాన పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల పింఛను పంపిణీ సులభతరం చేయటం దాతృత్వం కాదు: డాక్టర్ జితేంద్ర సింగ్


కుటుంబ పింఛన్ల ఫిర్యాదుల పరిష్కారంలో సంతానం లేని వితంతువులు, అవివాహితలు, విడాకులు తీసుకున్న కూతుళ్లకు భారీ ఉపశమనం కలగనుండటంతో.. మహిళా సాధికారత దిశగా సానుకూల అడుగు

Posted On: 01 JUL 2024 6:02PM by PIB Hyderabad

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ(డీఓపీపీడబ్ల్యూ) చేపట్టనున్న కుటుంబ పింఛన్ల ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు.

 

దేశ నిర్మాణంలో పింఛనుదారులను సమాన భాగస్వాములు, పింఛను పంపిణీకి సులభతరం చేయడం దాతృత్వం కాదని, సీనియర్ సిటిజన్లు కీలక పాత్ర పోషిస్తారని, సానుకూల పాత్ర పోషిస్తారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), భూ విజ్ఞాన సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో, అణుశక్తి శాఖ సహాయ మంత్రి.. అంతరిక్ష శాఖ సహాయ మంత్రి. .సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వారు కూడగట్టిన విజ్ఞానం, జ్ఞానంతో జీవితంలో ఉచ్ఛస్థాయిలో ఉన్నారని.. వారి అనుభవం, నిపుణత విలువ జోడిస్తుందని అన్నారు. దీనిని దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు కాబట్టి వారి సేవలను గౌరవించడం మన కర్తవ్యం అని ఆయన అన్నారు.



గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా సున్నితంగా ఆ శాఖ తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా నిలిచారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు.

 

60 ఏళ్లు పైబడిన పౌరులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని, వారిని విస్మరించలేమన్న ఆయన..పింఛను సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని సృష్టిస్తుందని, తద్వారా వారు గౌరవంగా జీవించడానికి సాధికారత లభిస్తుందని తెలిపారు.



ఈ శాఖ తీసుకున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్… గతంలో విడాకులు తీసుకున్న కూతుళ్లు చట్టబద్ధంగా విడాకులు పొందే వరకు కుటుంబ పింఛనుకు దూరంగా ఉండేవారని, ఈ నిబంధనను సవరించామన్నారు. గల్లంతైన ఉద్యోగుల కోసం సంబంధిత కుటుంబం ఏడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చించన్నారు. . ఇలాంటి అనేక అడ్డంకులను తొలగించామని తెలిపారు.

సీపీఈఎన్‌జీఆర్‌ఏఎంఎస్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న కుటుంబ పింఛను కేసులను సకాలంలో పరిష్కరించేందుకు నెల రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం జూలై 1 నుంచి 2024 జూలై 31 వరకు కొనసాగనుంది. 46 శాఖలు/ మంత్రిత్వ శాఖలకు చెందిన 1891 కుటుంబ పింఛను సంబంధిత ఫిర్యాదులను క్యాంపెయిన్ కోసం ఎంపికచేశారు. ఈ క్యాంపెయిన్ ప్రభావాన్ని వివరిస్తూ సీపీఈఎన్‌జీఆర్‌ఏఎంఎస్ పోర్టల్‌లో ఏటా నమోదవుతున్న 90,000 ఫిర్యాదుల్లో 25 శాతం కుటుంబ ఫించను ఫిర్యాదులేనని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో మానవీయ కోణాన్ని కూడా డాక్టర్ సింగ్ ప్రస్తావించారు. "ఫిర్యాదును పరిష్కరించిన తరువాత అభిప్రాయాన్ని సేకరించేందుకు ఒక మానవ‌సహిత డెస్క్ ఉంది" అని అన్నారు.

 

ఇండియా పోస్ట్, పేమెంట్స్ బ్యాంక్ ఫర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ సహకారంతో డీఓపీపీడబ్ల్యూ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటివద్దే అందించడం ప్రాధాన్యత అని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. రాబోయే రోజుల్లో భవిష్య పోర్టల్‌ను ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్(సంబంధిత నిబంధనల సవరణతో సహా)తో అనుసంధానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.



కుటుంబ పింఛన్ల ఫిర్యాదుల పరిష్కారంలో సంతానం లేని వితంతువులు, అవివాహితులు, విడాకులు తీసుకున్న కుమార్తెలు భారీ ఉపశమనం పొందడం మహిళా సాధికారత దిశగా సానుకూల ముందడుగు అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

పలువురు లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకుంటూ మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పింఛనుదారుల నుంచి సూచనలు తీసుకున్న మంత్రి వీలైనంత త్వరగా వాటిని చేర్చుకుంటామని హామీ ఇచ్చారు.

డీఓపీపీడబ్ల్యూ, డీఏఆర్‌పీజీ కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్..మాజీ సైనికోద్యోగుల సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ నితిన్ చంద్ర, సీజీఏ ఎస్.ఎస్.దూబే, బీఎస్ఎఫ్ డీజీ డాక్టర్ నితిన్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీ (పింఛన్లు) శ్రీ ధృబజ్యోతి సేన్ గుప్తా, ఎస్‌బీఐ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ శ్రీ ప్రవీణ్ రాఘవేంద్ర ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 2030196) Visitor Counter : 42