హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సమక్షంలో, హరియాణా ప్రభుత్వం, గాంధీనగర్ లోని ఎన్ఎఫ్ఎస్‌యు మధ్య నేడు పంచకులలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు
ఎన్ఎఫ్ఎస్‌యుతో చేతులు కలపడం ద్వారా హరియాణాలో నేర న్యాయ వ్యవస్థ బలోపేతం కానుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, త్వరితగతిన న్యాయం, అందరికీ న్యాయం అనే భావనతో బ్రిటీష్ కాలం నాటి మూడుచట్టాలలో మార్పులు చేయబడ్డాయి.
కొత్త చట్టాలు ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష ఉన్న నేరాలకు ఫోరెన్సిక్ బృందం సందర్శనను తప్పనిసరి చేయనున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ నిపుణుల అవసరాన్ని పెంచుతుంది. దీనిని ఎన్ఎఫ్ఎస్‌యు అందిస్తుంది
ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో ఎన్ఎఫ్ఎస్‌యు క్యాంపస్‌లను ప్రారంభించామని, ఈ విశ్వవిద్యాలయాన్ని దేశంలోని 16 రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
ఇది సుశిక్షితమైన మానవ వనరులను సృష్టిస్తుంది, నేరాలను పరిష్కరించే సమయాన్ని వేగవంతం చేయడానికి, శిక్ష రేటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది
ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు విద్యను అందించడానికి, సుశిక్షితమైన మానవ వనరులను సిద్ధం చేయడానికి మాత్రమే కాకుండా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది
Posted On:
29 JUN 2024 5:42PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలో హరియాణా ప్రభుత్వం- నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం (ఎన్ఎఫ్ఎస్‌యు), గాంధీనగర్ మధ్య నేడు హరియాణా పంచకులలో అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ, ఎన్ఎఫ్ఎస్‌యు సహకారంతో, నేడు హరియాణాలో నేర న్యాయ వ్యవస్థకు శాస్త్రీయ పునాది వేయడానికి కృషి చేసినట్లు చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి మూడు చట్టాలు భారత న్యాయవ్యవస్థను శాసిస్తున్నాయని, సత్వర న్యాయం, అందరికీ న్యాయం అనే భావనతో వాటిని మార్చామని చెప్పారు. ఈ చట్టాల్లో మార్పుల్లో భాగంగా ఇప్పుడు ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలకు ఫోరెన్సిక్ బృందం సందర్శనలను తప్పనిసరి చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ నిపుణులకు అవసరం పెరుగుతుందని..., దీనిని ఎన్ఎఫ్ఎస్‌యు తీరుస్తుందని మంత్రి తెలిపారు. ఈ కొత్త నేర చట్టాలను అమలు చేయడానికి మానవ వనరులను సృష్టించాల్సిన అవసరం ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ విధానంతోనే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఈ కొత్త చట్టాల రూపకల్పన కూడా జరుగుతోంది. ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో ఈ విశ్వవిద్యాలయాల ప్రాంగణాలను ప్రారంభించామని, దేశంలోని 16 రాష్ట్రాలకు ఈ విశ్వవిద్యాలయాన్ని తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
దీనివల్ల శిక్షణ పొందిన సిబ్బందిని సృష్టించడంతో పాటు నేరాలను ఛేదించే వేగాన్ని పెంచడానికి, శిక్ష రేటును పెంచడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. దీనివల్ల శిక్షణ పొందిన మానవ వనరులు సమకూరడమే కాకుండా కొత్త చట్టాలు క్షేత్రస్థాయిలో అమలు కావడానికి ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు.
ఒకే ప్రాంగణంలో ప్రయోగశాల, విశ్వవిద్యాలయం, శిక్షణా సంస్థ ఉండటం వల్ల బోధకులకు, నేర్చుకునే విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఇక్కడ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటే భారత ప్రభుత్వం సొంత ఖర్చులతో ఫోరెన్సిక్ సైన్స్‌లో శిక్షణకు మంచి ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు విద్యను బోధించడానికి, సుశిక్షితమైన మానవ వనరులను సిద్ధం చేయడానికి మాత్రమే కాకుండా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లు(పీఎస్ఐలు), డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు, న్యాయమూర్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నేడు తీసుకున్న ఈ నిర్ణయం రానున్న రోజుల్లో హరియాణా నేర న్యాయ వ్యవస్థలో గొప్ప మార్పులను తీసుకువస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(Release ID: 2029612)
Visitor Counter : 78