ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

భారతదేశంపై మ్యూచువల్ ఎవాల్యుయేషన్ నివేదికను 2024 జూన్ లో సింగపూర్ లో జరిగిన ప్లీనరీలో ఆమోదించిన ఎఫ్ఏటిఎఫ్


ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) 2023-24 సంవత్సరంలో నిర్వహించిన మ్యూచువల్ ఎవాల్యుయేషన్ లో అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత్

మనీ లాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్ పై పోరాటంలో భారతదేశం చేసిన ప్రయత్నాలను ప్రశంసించిన ఎఫ్ఏటిఎఫ్
ఎఫ్ఏటిఎఫ్ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ లో భారతదేశం సాధించిన విజయం వృద్ధి పథంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రయోజనకరం

Posted On: 28 JUN 2024 3:06PM by PIB Hyderabad

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) 2023-24 సంవత్సరానికి నిర్వహించిన మ్యూచువల్ ఎవాల్యుయేషన్ లో భారత్ అద్భుత ఫలితాలు సాధించింది. జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సింగపూర్ లో నిర్వహించిన ప్లీనరీలో ఎఫ్ఏటిఎఫ్ ఆమోదించిన  భారతదేశానికి సంబంధించిన మ్యూచువల్ ఎవాల్యుయేషన్ నివేదికలో భారత్ నున ‘‘రెగ్యులర్ ఫాలో అప్’’ వర్గీకరణలో పెట్టింది. జి-20 దేశాలు మాత్రమే సాధించిన ఘనత ఇది. మనీ లాండరింగ్ (ఎంఎల్), ఉగ్రవాద ఫైనాన్సింగ్ (టిఎఫ్) వ్యతిరేక పోరాటంలో భారతదేశం చేసిన ప్రయత్నాలకు ఇది విశిష్టమైన మైలురాయి.

భారతదేశం చేసిన కృషికి ఎఫ్ఏటిఎఫ్ గుర్తింపు పొందిన ఇతర అంశాలు

·      అవినీతి, మోసం, వ్యవస్థీకృత నేరాల ద్వారా ఆర్జించిన నిధులు సహా ఎంఎల్/టిఎఫ్ ద్వారా ఏర్పడుతున్న రిస్క్ లను సమర్థవంతంగా ఎదుర్కొనడం

·      ఎంఎల్/టిఎఫ్ నుంచి ఎదురవుతున్న రిస్క్ లను తగ్గించేందుకు నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారతదేశం తీసుకున్న చర్యలు

·      నగదు లావాదేవీల కఠిన నియంత్రణ సహా జామ్ (జన్ ధన్, ఆధార్, మొబైల్) త్రయం అమలు కారణంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడం వల్ల లావాదేవీలన్నింటినీ మరింత తేలిగ్గా గుర్తించగలగడం; తద్వారా ఎంఎల్/టిఎఫ్ రిస్క్ లను సమర్థవంతంగా నిరోధించడం

ఎఫ్ఏటిఎఫ్ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ లో భారతదేశం సాధించిన విజయం వృద్ధిపథంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరం. ఫైనాన్షియల్ వ్యవస్థ స్థూల స్థిరత్వం, సమగ్రతకు ఇది దర్పణం. మంచి రేటింగ్ లభించడం వల్ల ప్రపంచ మార్కెట్లకు అనుసంధానత ఏర్పడుతుంది. ఇన్వెస్టర్ విశ్వాసం పెరుగుతుంది. భారతదేశానికి చెందిన సత్వర చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ పట్ల ప్రపంచవ్యాప్త విస్తరణకు వీలు కలుగుతుంది.

ఎంఎల్/టిఎఫ్ ముప్పు నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం తీవ్రస్థాయిలో సమర్థవంతంగా తీసుకున్న నివారణ చర్యలకు ఈ ఎఫ్ఏటిఎఫ్ గుర్తింపు గీటురాయి. ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటానికి అనుకూలంగా ప్రభుతవం తీసుకున్న చర్యలకు, అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించేందుకు ప్రకటించిన కట్టుబాటుకు ఇది నిదర్శనం. ఉగ్రవాద ఫైనాన్సింగ్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రమాణాలు సమర్థవంతంగా అమలు పరిచేలా ఇతర దేశాలకు కూడా ఇది ఉత్తేజితంగా నిలుస్తుంది. అలాగే భారతదేశం సాధించిన ఈ విజయం ఉగ్రవాద ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న ప్రయత్నాలకు నాయకత్వం వహించగల భారతదేశ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.

ఎంఎల్, టిఎఫ్, నల్లధనం వంటివి నిర్మూలించేందుకు 2014 సంవత్సరం నుంచి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం అనుసరించిన ఈ బహుముఖీన వ్యూహం సమర్థవంతమైనదిగా, సానుకూల ఫలితాలు సాధించేదిగా నిరూపితమయింది. కార్యాచరణపూర్వకమైన గూఢచర్య ప్రయత్నాల ద్వారా ఉగ్రవాద ఫండింగ్ ను ధ్వంసం చేయడంలో భారత అధికారుల విజయానికి ఇది నిదర్శనం. భారత కోస్తాలో  ఉగ్రవాద ఫైనాన్సింగ్, నల్లధనం, మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని  ఈ చర్యలు నిలువరించాయి.

ఇదిలా ఉండగా గత రెండు సంవత్సరాలుగా ఎఫ్ఏటిఎఫ్ లో మ్యూచువల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ విషయంలో రెవిన్యూ శాఖ (డిఓఆర్) తీవ్ర కృషి చేసింది.  విభిన్న మంత్రిత్వ శాఖలు, జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్ఎస్ సిఎస్), రాష్ర్ట అధికారులు, న్యాయ వ్యవస్థ, ఆర్థిక రెగ్యులేటర్లు, స్వయం నియంత్రిత సంస్థలు, ఆర్థిక సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కీలక పాత్ర పోషించాయి. ఎఎంఎల్/సిఎఫ్ టి వ్యవస్థల సమన్వయపూర్వక చర్యలను ఇది ప్రతిబింబిస్తుంది.

భారతదేశం ఇప్పటికే ఎఫ్ఏటిఎఫ్ స్టీరింగ్ గ్రూప్ సభ్య దేశంగా ఉంది. గ్రూప్ స్థూల పనితీరు మెరుగుపరచడంలో భారతదేశానికి వర్తమాన పనితీరు ఎంతో దోహదపడుతుంది.

ఎఎంఎల్/సిఎఫ్ టి వ్యవస్థను మరింత పటిష్ఠపరచడానికి, ఆర్థిక నేరాలపై పోరాటం విషయంలో అంతర్జాతీయ భాగస్వాములతో సహకారానికి భారతదేశం కట్టుబడి ఉంది. మరింత సురక్షితమైన, పారదర్శకమైన ఆర్థిక వాతావరణం కల్పించడంలో ఈ విజయాన్ని పునాదిగా తీసుకుంటుంది.  

ఎఫ్ఏటిఎఫ్ గురించి :

మనీలాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తున్న సంబంధిత రిస్క్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్న విభిన్న ప్రభుత్వాలకు భాగస్వామ్యం ఉన్న సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్). 1989లో ఏర్పాటైన ఈ సంస్థలో భారత్ 2010 సంవత్సరంలో భాగస్వామిగా చేరింది.

***



(Release ID: 2029482) Visitor Counter : 57