రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మెరుగు పరచిన బూస్టర్ కాన్ఫిగరేషన్ తో అభివృద్ధిపూర్వకమైనపరీక్షల ను విజయవంతం గా పూర్తి చేసిన హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ ‘అభ్యాస్’

Posted On: 27 JUN 2024 8:17PM by PIB Hyderabad

రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ) మెరుగులు దిద్దిన బూస్టర్ కాన్ఫిగరేషన్ అండ తో హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హెచ్ఇఎటి) అభ్యాస్యొక్క అభివృద్ధిపూర్వకమైన పరీక్ష ను వరుస గా ఆరో సారి విజయవంతం గా పూర్తి చేసింది. దీనిని ఒడిశా లోని చండీపుర్ లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుండి నిర్వహించడమైంది. దీనితో అభ్యాస్ఈ వ్యవస్థ యొక్క విశ్వసనీయత ను చాటి చెప్తూ, పది ఈ తరహా పరీక్షల ను విజయవంతం గా ముగించుకొంది.

 

ఈ పరీక్షల ను మెరుగులు దిద్దిన రేడార్ క్రాస్ సెక్షన్, విజువల్ ఎండ్ ఇన్ ఫ్రారెడ్ ఆగ్‌మెంటేషన్ సిస్టమ్స్ దన్ను తో జరిపారు. ఈ పరీక్షల క్రమం లో, బూస్టర్ ను భద్రం గా విడుదల చేయడం, లాంచర్ క్లియరెన్స్ మరియు మన్నికైన ప్రదర్శన వంటి ఈ మిశన్ యొక్క లక్ష్యాలు జయప్రదం గా నెరవేరాయి. కనీస లాజిస్టిక్స్ తో తేలికైన ఆచరణ ను చూపుతూ 30 నిమిషాల అంతరం లో రెండు ప్రయోగాల ను నిర్వహించడమైంది. ఈ గగనతల విహార పరీక్షల ను విభిన్న సేన ల ప్రతినిధులు చూశారు.

 

బెంగళూరు లోని డిఆర్ డిఒ యొక్క ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిశ్‌మెంట్ అభ్యాస్కు రూపురేఖల ను ఇవ్వగా, దీనిని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇంకా లార్సెన్ & టుబ్రో లు అభివృద్ధి పరచాయి. ఇది ఆయుధ వ్యవస్థల కు ఒక వాస్తవికమైనటువంటి ముప్పు ను ఎదుర్కొనే సత్తా ను సమకూర్చుతున్నది. దేశీయం గా రూపొందించిన ఈ వ్యవస్థ స్వయంచాలక శక్తి ని కలిగి ఉంది. దీనిలో ఆటో పైలట్, లాప్ టాప్ ఆధారితమైన భూ నియంత్రణ వ్యవస్థ, నింగి కి ఎగసే కంటే ముందే తనిఖీల నిర్వహణల తో పాటు స్వయం ప్రేరిత వాయు గమనం వంటి హంగుల ను జత పరచడమైంది. నింగి లో ప్రయాణించే కాలం లో డేటా ను రికార్డు చేసే ప్రత్యేక ఏర్పాటు కూడా దీనిలో ఉంది. ఈ ఏర్పాటు అభ్యాస్నేల మీదకు తిరిగి వచ్చాక చేపట్టే విశ్లేషణ కు పనికి వస్తుంది. బూస్టర్ ను అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లేబొరేటరీ తీర్చిదిద్దగా, మార్గనిర్దేశక వ్యవస్థ ను రిసర్చ్ సెంటర్ ఇమారత్ సమాకూర్చింది. ఏయే భాగాల ను ఏయే ఏజెన్సీ లు ఉత్పత్తి చేయాలనేది నిర్దారణ కావడం తో, అభ్యాస్ఇక తుది ఉత్పత్తి కోసం తయారు గా ఉంది.

 

అభ్యాస్ యొక్క అభివృద్ధిపూర్వకమైన పరీక్షల కు గాను డిఆర్ డిఒ కు, సాయుధ దళాల కు మరియు పరిశ్రమ రంగానికి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ అభినందనల ను తెలిపారు. పరీక్షలు విజయవంతం కావడం శాస్త్రవేత్తల కు మరియు పరిశ్రమ కు మధ్య మేలైన కలయిక నెలకొందనడానికి ప్రముఖమైన నిదర్శన గా ఉంది అని ఆయన అన్నారు.

 

రక్షణ, పరిశోధన మరియు అభివృద్ధి విభాగం యొక్క కార్యదర్శి మరియు డిఆర్ డిఒ యొక్క చైర్ మన్ డాక్టర్ శ్రీ సమీర్ వి. కామత్ ప్రయోగాత్మక గగనతల విహార పరీక్ష సఫలం కావడం లో పాలుపంచుకొన్న బృందాల కు అభినందనల ను తెలియ జేశారు. ఈ వ్యవస్థ ఖర్చు పరం గా చూస్తే లాభకారి అని, అంతేకాకుండా దీనిని పెద్ద ఎత్తున ఎగుమతి చేసేందుకు అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

 

***

 



(Release ID: 2029429) Visitor Counter : 18