వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పిఎమ్ గతిశక్తి లో భాగమైన నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూపుయొక్క  డెబ్భై మూడో సమావేశం లో ఎనిమిదికీలకమైన మౌలిక సదుపాయాల కల్పన సంబంధి ప్రాజెక్టుల ను మూల్యాంకనం చేయడమైంది


రైల్ వే ల ప్రాజెక్టులు రెండిటిని మరియు ఎన్ఐసిడిసిప్రాజెక్టులు ఆరిటిని మదింపు చేసిన ఎన్ పిజి

Posted On: 27 JUN 2024 4:20PM by PIB Hyderabad

నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూపు (ఎన్‌పిజి) యొక్క 73 వ సమావేశాన్ని న్యూ ఢిల్లీ లో 2024 జూన్ 21 వ తేదీ న నిర్వహించడమైంది. ఈ సమావేశాని కి డిపార్ట్ మెంట్ ఫార్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రి ఎండ్ ఇంటర్‌నల్ ట్రేడ్ (డిపిఐఐటి) అడిషనల్ సెక్రెట్రి శ్రీ రాజీవ్ సింహ్ ఠాకుర్ అధ్యక్షత వహించారు. ఎనిమిది ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ను మూల్యాంకనం చేయడం పైన ఈ సమావేశం లో దృష్టి ని కేంద్రీకరించడమైంది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల లో రెండు రైల్ వే ల మంత్రిత్వ శాఖ (ఎమ్ఒఆర్) కు చెందిన ప్రాజెక్టులు రెండు, డిపిఐఐటి లోని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసిడిసి)కు చెందిన ప్రాజెక్టు లు ఆరు ఉన్నాయి.

 

రైల్ వే ల మంత్రిత్వ శాఖ కు చెందిన ఒకటో ప్రాజెక్టు మహారాష్ట్ర లోని నాసిక్ మరియు జల్ గాఁవ్ జిల్లాల లో మన్‌ మాడ్ నుండి జల్ గాఁవ్ వరకు 160 కిలో మీటర్ ల పొడవైన నాలుగో బ్రాడ్ గేజ్ రైల్ వే లైను నిర్మాణాని కి సంబంధించింది. 2,594 కోట్ల రూపాయల అంచనా పెట్టుబడి తో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఉన్న మార్గం యొక్క సెక్షన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరకు రవాణా రైళ్లతో పాటు ప్రయాణికుల రైళ్ళు కూడా వాటి రాకపోకల ను సాఫీ గా సాగించేందుకు తోడ్పడనుంది. ఈ ప్రాజెక్టు జాతీయ మౌలిక సదుపాయాల కల్పన సంబంధి ప్రాథమ్యాల కు అనుగుణం గాను మరియు ఆ ప్రాంతం లో భావి కాలపు రవాణా అవసరాల ను తీర్చడానికి కీలకమైంది గాను ఉంది.

 

రైల్ వే ల మంత్రిత్వ శాఖ కు చెందిన రెండో ప్రాజెక్టు మహారాష్ట్ర లోని జల్ గాఁవ్ జిల్లా భుసావల్ నుండి మధ్య ప్రదేశ్ లోని బుర్ హాన్ పుర్, ఇంకా ఖండ్ వా జిల్లాల వరకు 130.5 కిలో మీటర్ ల మేర మూడో మరియు నాలుగో బ్రాడ్ గేజ్ రైల్ వే లైన్ ల నిర్మాణాని కి సంబంధించింది. 3,285 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో కూడిన ఈ ప్రాజెక్టు సదరు సెక్షన్ యొక్క సామర్థ్యాన్ని గణనీయం గా పెంచడం తో పాటు ప్రాంతీయ అభివృద్ధి ని ప్రోత్సహించడం మరియు లాజిస్టిక్స్ రంగం లో భారతీయ రైల్ వే ల యొక్క బజారు వాటా ను వృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతం లో ఆర్థిక ఎదుగుదల కు మరియు చిరకాలం మన్నేటటువంటి రవాణా అవసరాల ను తీర్చడాని కి దోహదం లభించనుంది.

 

ఈ రెండు ప్రాజెక్టు లు బొగ్గు, సిమెంటు మరియు ఖనిజాల ఉత్పత్తి రంగాల కు కనెక్టివిటీ ని అందించడం కోసం రైల్ వే ల మంత్రిత్వ శాఖ సంకల్పించిన ఎనర్జీ మినరల్ సిమెంట్ కారిడర్ (ఇఎమ్ సిసి) కార్యక్రమం లో ఓ భాగం గా ఉన్నాయి.

 

ఎన్‌సిడిసి యొక్క నాలుగు ప్రాజెక్టు లు ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా మరియు ప్రయాగ్ రాజ్ లలో, హరియాణా లోని హిసార్ లో, ఇంకా బిహార్ లోని గయ లో ఇంటిగ్రేటెడ్ మేన్యుఫేక్చరింగ్ క్లస్టర్స్ (ఐఎమ్‌సి స్) ను అభివృద్ధి పరచడానికి సంబంధించినవి. వీటి అంచనా పెట్టుబడి 8,175 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు ల ఉద్దేశ్యం విద్య పరమైనటువంటి మరియు ఆరోగ్య సంరక్షణ ప్రధానమైనటువంటి సేవల ను కల్పించడం తో పాటు గా స్మార్ట్ టెక్నాలజీస్, లాజిస్టిక్స్, నివాస సదుపాయాలు, వాణిజ్య సదుపాయాలు సహా ఇండస్ట్రి 4.0 ప్రమాణాల కు తుల తూగే అత్యాధునిక తయారీ కేంద్రాల ను అభివృద్ధి పరచాలన్నదే. ఇ-మొబిలిటీ, ఫూడ్ ప్రాసెసింగ్, ఎఫ్ఎమ్ సిజి, తోలు, దుస్తులు వంటి రంగాల అవసరాల ను ఈ ఐఎమ్‌సి లు తీరుస్తాయి.

 

ఎన్ఐసిడిసి కే చెందిన రెండు ప్రాజెక్టుల లో ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో గల ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతం మరియు వైఎస్ఆర్ కడప జిల్లా లోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం ల యొక్క అభివృద్ధి కలసి ఉన్నాయి. వీటి అంచనా పెట్టుబడి 5,367 కోట్ల రూపాయలు. పరిశ్రమల ను ఆకర్షించడం కోసం ఉన్నతమైన మౌలిక సదుపాయాల ను ఏర్పరచాలన్నది ఈ ప్రాజెక్టుల యొక్క ఉద్దేశ్యంగా ఉంది. ఈ ప్రాజెక్టు లు ప్రధాన రాజమార్గాలు, రైల్ వే లైన్ లు మరియు నౌకాశ్రయాల కు సమీపం లో నెలకొన్నాయి. సామాజిక-ఆర్థిక పురోగతి కి దన్నుగా నిలవడం తో పాటు ఉద్యోగ అవకాశాల ను గణనీయం గా కల్పించడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం గా ఉంది.

 

సమావేశం కొనసాగిన క్రమం లో, అన్ని ప్రాజెక్టుల ను వాటి సమీకృత ప్రణాళిక రచన పరం గాను మరియు పిఎమ్ గతిశక్తి సూత్రాల కు అనుగుణం గాను మూల్యాంకనం చేయడమైంది. సామాజిక-ఆర్థిక లాభాలు, మెరుగైన సంధానం, రవాణా ఖర్చుల లో తగ్గింపు మరియు సామర్థ్యాన్ని పెంచడం అనే అంశాల పైన శ్రద్ధ ను తీసుకోవడమైంది.

 

పారిశ్రమిక వృద్ధి కి ఊతాన్ని ఇస్తూ, పోటీతత్వాన్ని పెంచి మరి దేశ ఆర్థిక అభివృద్ధి లక్ష్యాల సాధన లో చెప్పుకోదగిన విధం గా తోడ్పాటు ను అందించడానికి సిద్ధం గా ఉన్నటువంటి కనెక్టివిటీ ని మెరుగు పరచడం లోను, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందింప చేయడం లోను, ఇంకా యావత్తు భారతదేశం లో ఉన్నత స్థాయి తయారీ సంబంధి ఇకోసిస్టమ్స్ ను నెలకొల్పడం లోను ఈ ప్రాజెక్టు లు ముఖ్యమైన పాత్ర ను పోషిస్తాయన్న ఆశ ఉంది.

***

 



(Release ID: 2029428) Visitor Counter : 15