ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

రాజ్య సభ లో సభ్యుడైన శ్రీ సంజయ్ సింహ్ యొక్క సస్‌పెన్శన్ ను ఉపసంహరించడానికి సంబంధించిన ప్రకటన

Posted On: 27 JUN 2024 1:48PM by PIB Hyderabad

రాజ్య సభ సభ్యుడు శ్రీ సంజయ్ సింహ్ కు విధించిన సస్‌పెన్శన్ ను ఉపసంహరిస్తున్నట్లు ఒక ప్రకటన ను సభాధ్యక్షుడు వెలువరించారు. ఆ ప్రకటన పాఠం ఈ క్రింది విధం గా ఉంది:

 

సభాధ్యక్షుడు: గౌరవనీయులైన సభ్యులారా, మీకు గుర్తు ఉండే ఉంటుంది, మాననీయ సభ్యుడు శ్రీ సంజమ్ సింహ్ ను సభ విశేషాధికారాల సంఘం తన నివేదిక ను ఇచ్చేటంత వరకు ఈ సభ యొక్క సేవల నుండి తాత్కాలికం గా నిలుపుదల చేస్తూ 2023 జులై 24 వ తేదీ న చర్య ను తీసుకోవడమైంది.


గౌరవనీయ సభ్యుడు శ్రీ సంజయ్ సింహ్ కు వ్యతిరేకం గా పెండింగు పడ్డ అంశాల పైన రాజ్య సభ యొక్క పివిలేజెస్ కమిటి 77 నివేదిక ను మరియు 78 వ నివేదిక ను 2024 జూన్ 26 వ తేదీ నాడు సమర్పించింది.

అన్ని అభియోగాలలోను శ్రీ సంజయ్ సింహ్ మండలి యొక్క విశేష అధికారాన్ని ఉల్లంఘించి దోషి అయినట్లు గా కమిటీ గుర్తించి, సభ్యుడు సదరు ఉల్లంఘన విషయం లో ఇప్పటికే చాలినంత గా శిక్ష ను అనుభవించినట్లు గా సిఫారసు చేసింది.

కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్య సభ) యొక్క ప్రక్రియ మరియు సభా వ్యవహారాల నిర్వహణ సంబంధి నియమం 202 మరియు నియమం 266 ల ప్రకారం దత్తం అయిన అధికారాన్ని ఉపయోగిస్తూ, సభ్యుడు శ్రీ సంజయ్ సింహ్ యొక్క తాత్కాలిక నిలుపుదల ను 2024 జూన్ 26 వ తేదీ నాటి నుండి వర్తించే విధం గా ఉపసంహరించడమైంది. తత్ఫలితంగా పార్లమెంటు కు హాజరు అయ్యేందుకు ఆయన ను అనుమతించడమైంది.


ఈ నిర్ణయాన్ని సభ ఆమోదిస్తుందని నాకు నమ్మకముంది.

 

***



(Release ID: 2029228) Visitor Counter : 17