యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

టాప్స్ పథకం సహకారంతో పారిస్ ఒలింపిక్స్ లో చోటు సాధించిన జుడోకా తులిక మాన్

Posted On: 26 JUN 2024 5:45PM by PIB Hyderabad

జూడోకా తులికా మాన్, భారత జూడోలో వర్ధమాన క్రీడా దిగ్గజం, రాబోయే ప్యారిస్ ఒలింపిక్ క్రీడలలో మహిళల 78 కిలోల పై తరగతిలో స్థానం సంపాదించింది. తులిక భారతదేశం నుండి ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే తొమ్మిదవ మహిళా జూడోకా. ప్రభుత్వ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) నుండి తనకు గణనీయమైన సహాయం అందిందని తులికా ఆనందం వ్యక్తం చేసింది. టాప్స్ కింద చాలా మంది అథ్లెట్లు ఏడాది పొడవునా ఈవెంట్‌లలో పాల్గొనడానికి మద్దతు పొందుతున్నారని, ఇది వారి ర్యాంకింగ్‌లను కొనసాగించడంలో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. "ఖర్చుల భారం మా మీద లేకపోతే\, మేము ఒత్తిడి లేకుండా పోటీలో పాల్గొనగలం, ఉత్తమమైన ప్రతిభను ప్రదర్శించగలం " ఆమె ఆమె అన్నారు. 

2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత తులికా వెలుగులోకి వచ్చారు. గత నెలలో అబుదాబిలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 32వ రౌండ్‌లో కెనడాకు చెందిన పోర్చుండో ఇసాసిపై ఆమె సాధించిన విజయం ఒలింపిక్ ర్యాంకింగ్స్‌లో ఆమె స్థానాన్ని గణనీయంగా పెంచింది. ఈ విజయం ఆమె పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలకమైంది.

గత ఏడాది హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు, ఈ ఏడాది ఏప్రిల్‌లో హాంకాంగ్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో ఆమె ఐదో స్థానం సాధించడం, అవసరమైన పాయింట్లను కూడగట్టడంలో కీలకం. “నేను ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఒక్కొక్కటి మూడు బౌట్‌లు గెలిచాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజయం నాకు సహాయపడింది," ఆమె వెల్లడించారు. 

టాప్స్ అనేది భారతదేశపు అగ్రశ్రేణి క్రీడాకారులకు సహాయం అందించడానికి ఉద్దేశించిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమం. నెలవారీ స్టైఫండ్‌తో పాటు విదేశీ శిక్షణ, అంతర్జాతీయ పోటీలు, పరికరాలు, కోచింగ్ క్యాంపుల ద్వారా ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు సంభావ్య క్రీడాకారులకు ఈ పథకం మద్దతు ఇస్తుంది.

 

***



(Release ID: 2029223) Visitor Counter : 11