కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బైజూస్ కు సంబంధించి ఈ మధ్యన వెలువడిన వార్తలను ఖండించిన ఎంసీఏ
నాడు పోస్టు చేయడమైనది:
26 JUN 2024 7:26PM by PIB Hyderabad
ఆర్థిక నేరాల ఆరోపణల నేపథ్యంలో బైజూస్ సంస్థపై జరుగుతున్న విచారణనుంచి ఆ సంస్థను తప్పించినట్టు వస్తున్న వార్తలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఖండించింది.
అలాంటి వార్తలను నమ్మవద్దని అవి అవాస్తవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వున్నాయని ఎంసీఏ నిర్ద్వందంగా స్పష్టం చేసింది. కంపెనీల చట్టం 2013 ప్రకారం ఎంసీఏ మొదలుపెట్టిన విచారణ కొనసాగుతోందని ఇప్పటివరకూ ఆ ఆరోపణలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంసీఏ పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2028928)
సందర్శకుల సూచీ సంఖ్య : : 119