రక్షణ మంత్రిత్వ శాఖ
ఫ్రాన్స్‌లోని సెయింట్ ట్రోపెజ్‌లో జరుగుతున్న 43వ ప్రపంచ మెడికల్, హెల్త్ క్రీడా పోటీల్లో చరిత్ర సృష్టించిన నలుగురు ఏఎఫ్ఎంఎస్ అధికారులు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య నిపుణుల క్రీడా పోటీల్లో 9 స్వర్ణాలతో సహా, 32 పతకాలు సాధించిన భారత్.
Posted On:
23 JUN 2024 5:00PM by PIB Hyderabad
ఫ్రాన్స్‌లోని సెయింట్ ట్రోపెజ్‌లో 16 జూన్ 202423 వరకు జరిగిన 43వ ప్రపంచ మెడికల్ అండ్ హెల్త్ క్రీడా పోటీలలో నలుగురు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ (ఏఎఫ్ఎంఎస్) అధికారులు రికార్డు స్థాయిలో 32 పతకాలు సాధించి భారత్‌కు కీర్తిని తీసుకువచ్చారు. ఆరోగ్య నిపుణుల కోసం జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీల్లో లెఫ్టినెంట్ కల్నల్ సంజీవ్ మాలిక్, మేజర్ అనీష్ జార్జ్, కెప్టెన్ స్టీఫెన్ సెబాస్టియన్, కెప్టెన్ డానియా జేమ్స్ మొత్తం 19 బంగారు పతకాలు, 09 రజత పతకాలు, 04 కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు.
లెఫ్టినెంట్ కల్నల్ సంజీవ్ మాలిక్ వీఎస్ఎం, ఐదు బంగారు పతకాలు (35 ఏళ్లు పైబడిన పురుషుల విభాగం) - ఈవెంట్లు: 800 మీటర్లు, 1500 మీటర్లు, 3000 మీటర్లు, 5000 మీటర్లు, క్రాస్ కంట్రీ, 4×100 మీటర్ల రిలే. మేజర్ అనీష్ జార్జ్, నాలుగు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలు (35 ఏళ్ల పురుషుల విభాగంలో) - ఈవెంట్లు: 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్లు, జావెలిన్, షాట్ పుట్, డిస్కస్ త్రో, హ్యామర్ త్రో, పవర్ లిఫ్టింగ్. కెప్టెన్ స్టీఫెన్ సెబాస్టియన్, ఆరు బంగారు పతకాలు (35 ఏళ్ల పురుషుల విభాగంలో) - ఈవెంట్లు: 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, లాంగ్ జంప్, హ్యామర్ త్రో, 4×100 మీటర్ల రిలే. కెప్టెన్ డానియా జేమ్స్, నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు (35 ఏళ్లలోపు మహిళల విభాగం) ఈవెంట్లు: 100 మీటర్లు, 200 మీటర్లు, 4×100 రిలే, జావెలిన్, డిస్కస్ త్రో, షాట్ పుట్, బ్యాడ్మింటన్ సోలో, బ్యాడ్మింటన్ డబుల్స్, పవర్ లిఫ్టింగ్ లలో పతకాలు సాధించారు.
డీజీఏఎఫ్ఎంఎస్ లెఫ్టినెంట్ జనరల్ దల్జీత్ సింగ్ అద్భుతమైన పనితీరు కనబరిచిన భారత అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రపంచ మెడికల్ అండ్ హెల్త్ క్రీడా పోటీలను, తరచుగా ఆరోగ్య నిపుణుల ఒలింపిక్ క్రీడలుగా పరిగణిస్తారు. 1978లో ప్రారంభమైన ఈ క్రీడలు వైద్య సమాజంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ క్రీడా కార్యక్రమంగా అభివృద్ధి చెందింది. ఈ క్రీడలకు ఏటా 50కి పైగా దేశాల నుంచి 2500 మందికి పైగా పాల్గొంటారు.
ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఆఫీసర్ల ప్రదర్శనలు వారి ఔన్నత్యాన్ని ప్రముఖంగా పేర్కొనడమే కాకుండా, వారి వైద్య నైపుణ్యాన్ని క్రీడా విజయాలతో మిళితం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ నిపుణుల అంకితభావాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్యులు, నర్సులు ఫిట్‌నెస్ అంబాసిడర్లుగా మారేందుకు ఈ విజయం ప్రేరణ ఇస్తుంది.
***
(Release ID: 2028328)
Visitor Counter : 67