నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

జాతీయ హరిత ఉదజని మిషన్ (ఎన్‌జిహెచ్ఎం) ‘సైట్’ ఎస్ఐజిహెచ్‌టి కార్యక్రమం కింద ఎరువుల రంగానికి కేటాయింపు పెంచిన ప్రభుత్వం


హరిత అమ్మోనియా వార్షిక కేటాయింపు 5 లక్షల
టన్నుల నుంచి 7.5 లక్షల టన్నులకు పెంపు;

Posted On: 22 JUN 2024 1:08PM by PIB Hyderabad

దేశంలో 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల హరిత ఉదజని ఉత్పాదక సామర్థ్యం సాధించే లక్ష్యంతో నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఇ) జాతీయ హరిత ఉదజని మిషన్ (ఎన్‌జిహెచ్ఎం)ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘ఎన్‌జిహెచ్ఎం’ పరిధిలో (మోడ్2ఎ కింద) హరిత అమ్మోనియా ఉత్పత్తి సేకరణపై ప్రోత్సాహక సంబంధిత ‘సైట్’ (ఎస్ఐజిహెచ్‌టి) కార్యక్రమ అంశం-II పథకంపై 16.01.2024న మార్గదర్శకాలను జారీ చేసింది. ‘మోడ్2ఎ’ అన్నది ఎరువుల రంగ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించినది. ఈ నేపథ్యంలో దీని తొలి విడత (ట్రాంచ్- I) బిడ్డింగ్ కింద సంవత్సరానికి 5,50,000 టన్నుల హరిత అమ్మోనియా ఉత్పాదక సామర్థ్యం సాధించాలని మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. అనంతరం భారత సౌరశక్తి సంస్థ (ఎస్ఇసిఐ) ఉత్పత్తి వ్యయం ఆధారిత పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా హరిత అమ్మోనియా ఉత్పత్తిదారుల ‘ఎంపిక కోసం అభ్యర్థన’ (ఆర్ఎఫ్ఎస్) జారీ చేసింది.

   మిషన్ అమలు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రంగాల నుంచి హరిత ఉదజనితోపాటు దాని ఉత్పన్నకాలకూడా డిమాండ్ పెరుగుతోంది. తదనుగుణంగా ఎరువుల రంగం నుంచి హరిత అమ్మోనియా డిమాండ్ కూడా పెరుగుతుండటంతో 16.01.2024నాటి పథకం మార్గదర్శకాలను సవరించాలని ‘ఎంఎన్ఆర్ఇ’ నిశ్చయానికి వచ్చింది. ఆ మేరకు ఎరువుల రంగానికి ‘మోడ్ 2ఎ’ కింద కేటాయింపులను సంవత్సరానికి 2 లక్షల టన్నుల మేర పెంచాలని నిర్ణయించింది. దీని ప్రకారం- హరిత అమ్మోనియా వార్షిక కేటాయింపు ప్రస్తుత 5,50,000 టన్నుల నుంచి 7,50,000 టన్నులకు పెరుగుతుంది. దేశంలో హరిత ఉదజని, దాని ఉత్పన్నకాల డిమాండ్ సృష్టి దిశగా ఇదొక కీలక ముందడుగు కానుంది (సవరణ ఉత్తర్వు కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయవచ్చు).

   జాతీయ హరిత ఉదజని మిషన్ (ఎన్‌జిహెచ్ఎం)ను 2023 జనవరి 4న ప్రారంభమైంది. దీన్ని రూ.19,744 కోట్ల అంచనా వ్యయంతో 2029-30 ఆర్థిక సంవత్సరం దాకా కొనసాగించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. పరిశుభ్ర ఇంధనం ద్వారా స్వావలంబన సాధించాలనే భారతదేశ లక్ష్యానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. అలాగే ప్రపంచ పరిశుభ్ర ఇంధన పరివర్తనకు ఇది ప్రేరణగా నిలుస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గారాల గణనీయ తగ్గింపునకు బాటలు వేస్తుంది. అంతేకాకుండా శిలాజ ఇంధన దిగుమతులపై పరాధీనత తగ్గుతుంది. ముఖ్యంగా హరిత ఉదజని రంగంలో సాంకేతికత, మార్కెట్ పరంగా భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతుంది.

 

***



(Release ID: 2027970) Visitor Counter : 76