ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటన
Posted On:
17 JUN 2024 12:58PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రమాద స్థలికి చేరుకోనున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు వంతున పరిహారం చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రైలు ప్రమాదంపై స్పందిస్తూ ప్రధానమంత్రి 'ఎక్స్' ద్వారా పంపిన సందేశంలో:
''పశ్చిమ బెంగాల్ లో రైలు ప్రమాదం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దీనిపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. ప్రమాద స్థలంలో బాధితులను ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు'' అని పేర్కొన్నారు.
కాగా... ప్రధానమంత్రి కార్యాలయం 'ఎక్స్' ద్వారా పంపిన సందేశంలో:
''పశ్చిమ బెంగాల్ లో రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి పరిహారం ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది" అని పేర్కొంది.
***
DS/TS
(Release ID: 2026001)
Visitor Counter : 77
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam