ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్లో బస్సు ప్రమాదం లో జరిగిన ప్రాణనష్టానికి సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి,బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 15 JUN 2024 7:44PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ప్రియతములను కోల్పోయిన కుటుంబాల కు ఆయన సంతాపాన్ని తెలియజేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరగా పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నది:

 

‘‘ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో జరిగిన రహదారి దుర్ఘటన హృదయవిదారకం గా ఉంది. దీనిలో తమ ప్రియజనులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయిన దగ్గరి బంధువులకు ఇదే నా యొక్క ప్రగాఢమైన సంతాపం. ఈ ప్రమాదం లో గాయపడ్డ వారంతా శీఘ్రంగా పున:స్వస్థులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం పీడితులకు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడం లో తలమునకలుగా ఉంది: ప్రధాన మంత్రి’’

బస్సు దుర్ఘటన లో ప్రభావితులు అయిన వారి కోసం పరిహారం రూపం లో ఆర్థిక సహాయాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రకటన చేశారు.

 

ఆ ప్రకటన ప్రకారం, మృతుల సమీప బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది; దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.

 

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నది:

 

మృతుల దగ్గరి బంధువులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి

***

DS/RT



(Release ID: 2025796) Visitor Counter : 22