కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఇపిఎఫ్ఒ లో సంస్కరణ ల పై జరిగిన సమీక్ష సమావేశాని కిఅధ్యక్షత వహించిన శ్రమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి

Posted On: 14 JUN 2024 11:14AM by PIB Hyderabad

ఇపిఎఫ్ఒ లో సంస్కరణల పై 2024 జూన్ 13 వ తేదీ న జరిగిన ఒక సమీక్ష సమావేశాని కి శ్రమ మరియు ఉపాధి ల మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శి శ్రీమతి సుమిత డావ్‌ రా అధ్యక్షత ను వహించారు. ఈ సమావేశం లో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిశనర్ (సిపిఎఫ్‌సి) శ్రీమతి నీలమ్ శమి రావు, శ్రమ మరియు ఉపాధి ల మంత్రిత్వ శాఖ కు మరియు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) కు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

క్లెయిము ల పరిష్కారానికి ఆటోమేటిక్ పద్ధతి ని ప్రవేశపెట్టడం మరియు క్లెయిము లు తిరస్కరణ కు లోనయ్యే సందర్భాల ను తగ్గించడం కోసం ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) తీసుకొన్న ఇటీవలి చర్యల ను శ్రీమతి సుమిత డావ్‌ రా ప్రశంసించారు. క్లెయిముల ను త్వరిత గతి న పరిష్కరించడం, అనారోగ్యం, విద్య, వివాహం మరియు గృహ నిర్మాణం ల కోసం ఒక లక్ష రూపాయల వరకు విలువైన అడ్వాన్సుల ను ఆటో సెటిల్‌మెంట్ పద్ధతి లో పరిష్కరించడం అనే సంస్కరణల ను ఇపిఎఫ్ఒ ఆచరణ లోకి తీసుకు వచ్చింది. దాదాపు గా 25 లక్షల సంఖ్య లో అడ్వాన్స్ క్లెయిముల ను ఆటో మోడ్ లో పరిష్కరించడమైంది. ఇంతవరకు పరిష్కరించినటువంటి అస్వస్థత సంబంధి క్లెయిము ల లో 50 శాతాని కి పైగా క్లెయిముల ను ఆటో మోడ్ లో పరిష్కరించడమైంది. దీనితో పెద్ద సంఖ్య లో క్లెయిము ల యొక్క పరిష్కారం ఇప్పుడు మూడు రోజుల లోపల పూర్తి అవుతున్నది.

సభ్యుల కు చెందిన కెవైసి ఆధార్ తో ముడి పడిన ఖాతా ల విషయం లో బ్యాంకు ఖాతా చెక్ బుక్/పాస్ బుక్ ల అప్ లోడింగ్ ఆవశ్యకత ను సమాప్తం చేసేయడమైంది; దీని తో గత నెల రోజుల లో సుమారు గా 13 లక్షల క్లెయిముల లో ధ్రువీకరణ అగత్యం తప్పింది.

ఇపిఎఫ్ఒ అసంపూర్తి గా ఉన్న కేసుల ను వాపసు చేయడం మరియు అర్హత లేని కేసుల ను త్రోసిపుచ్చడం కోసం సభ్యులు ఇట్టే అర్థం చేసుకొనేటట్లుగా ఆయా ఫైళ్ళ పై వ్రాసే వ్యాఖ్యల ను సైతం తగ్గించడం తో పాటు క్రమబధ్ధం కూడా చేసింది.

ఆటో ట్రాన్స్‌ ఫర్ ల సంఖ్య కూడ 2024 ఏప్రిల్ లో రెండు లక్షలు గా ఉన్నవి కాస్తా మూడింతలై 2024 మే నెల వచ్చేసరికి ఆరు లక్షల కు చేరుకొన్నాయి. వ్యవస్థాగత సంస్కరణల విషయం లో ఏదైనా సమస్య ఎదురైన తరువాత ఆ సమస్య విషయం లో తగిన చర్యల ను చేపడుదామన్న వైఖరి కి బదులుగా ముందస్తుగానే తదనుగుణమైన చర్యల ను తీసుకోవడాన్ని కొనసాగించవలసింది గా ఇపిఎఫ్ఒ కు శ్రీమతి సుమిత డావ్‌ రా సూచించారు.

ప్రతి ఒక్క సభ్యుని కోసం యుఎఎన్ ఆధారితమైన సింగల్ అకౌంటింగ్ సిస్టమ్, క్లెయిముల ను వేగం గా పరిష్కరించడం కోసం మానవ జోక్యాన్ని కనీస స్థాయి కి పరిమితం చేయడం మరియు ప్రక్రియ లో ఆటోమేశన్ వంటి చర్యల తో ఇపిఎఫ్ఒ తన సేవల సంబంధి సాఫ్ట్ వేర్ లో మార్పు చేర్పుల ను చేపడుతున్నది. క్రొత్త సాఫ్ట్ వేర్ ను సెంటర్ ఫార్ డివెలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌ డ్ కంప్యూటింగ్ (సిడిఎసి) యొక్క సలహాల తో రూపొందించడం జరుగుతున్నది.

సామాజిక సురక్ష కవచం యొక్క విస్తరణ మరియు జీవించడం లో సౌలభ్యం, ఇంకా వ్యాపారం చేయడం లో సౌలభ్యంల కోసం సరిక్రొత్త కార్యక్రమాల ను చేపట్టవలసిన అవసరం ఉందని సమీక్ష సమావేశం ప్రముఖం గా ప్రకటించింది. లిటిగేశన్ మేనేజ్‌మెంట్ లో మరియు ఆడిట్ లో నిర్వహణ పరమైన సంస్కరణ ల అంశం కూడ సమావేశం లో చర్చించడమైంది.

ఒక ప్రభావ వంతమైన సామాజిక సురక్ష వ్యవస్థ కోసం అధికారులు సన్నిహిత సమన్వయం తో పని చేయవలసిందని శ్రీమతి సుమిత డావ్‌ రా కోరారు.

 

***

 



(Release ID: 2025274) Visitor Counter : 46