ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కువైత్ సిటీ లో మంటలు రేగిన దుర్ఘటన లో జరిగిన ప్రాణనష్టానికి సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 12 JUN 2024 7:17PM by PIB Hyderabad

కువైత్ సిటీ లో మంటలు చెలరేగిన దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్థితి ని కువైత్ లోని భారత రాయబార కార్యాలయం నిశితం గా పర్యవేక్షిస్తున్నదని, బాధితులకు సాయపడడం కోసం అధికారులతో కలసి కృషి చేస్తోందని ప్రధాన మంత్రి బరోసా ఇచ్చారు.

 

కువైత్ లోని భారత రాయబార కార్యాలయం యొక్క సందేశాన్ని ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం ద్వారా తెలియజేస్తూ,

‘‘కువైత్ లో జరిగిన అగ్ని ప్రమాదం దు:ఖదాయకంగా ఉంది. ఆప్తులను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరిత గతి న కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. స్థితి ని కువైత్ లోని భారత రాయబార కార్యాలయం నిశితం గా పర్యవేక్షిస్తున్నది, బాధితులకు సాయపడడం కోసం అధికారులతో కలసి కృషి చేస్తోంది’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 2024943) आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam