పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

యోగ యొక్క పదో అంతర్జాతీయ దినాని కి సన్నాహక కార్యక్రమంగా యోగ వర్క్ శాపు  ను నిర్వహించినపార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 12 JUN 2024 2:04PM by PIB Hyderabad

యోగ గురు డాక్టర్ శ్రీ సురక్షిత్ గోస్వామి యొక్క మార్గదర్శకత్వం లో యోగ కార్యశాల ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీ లోని పార్లమెంట్ హౌస్ గ్రంథాలయ భవనం లో 2024 జూన్ 10 వ తేదీ న నిర్వహించింది. ఈ వర్క్ శాపు ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఉమంగ్ నరూలా ప్రారంభించారు. ఈ సందర్భం లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడిశనల్ సెక్రట్రి డాక్టర్ శ్రీ సత్య ప్రకాశ్ మాట్లాడుతూ, యోగ అంతర్జాతీయ దినం ప్రాముఖ్యాన్ని గురించి వివరించారు. డాక్టర్ శ్రీ సురక్షిత్ గోస్వామి మాట్లాడుతూ, మన రోజువారీ జీవనం లో యోగ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రముఖం గా పేర్కొన్నారు. అంతేకాకుండా, వృత్తిగతమైన మరియు వ్యక్తిగతమైన జీవనం లో సమర్ధత కోసమని సభికుల చేత ఆయన కొన్ని ప్రభావవంతమైన యోగ భంగిమలను మరియు ప్రాణాయామాన్ని చేయించారు. యోగ ను మరియు ప్రాణాయామాన్ని అభ్యసిస్తూ ఉంటే వాటి వల్ల సమకూరే విస్తృత ప్రయోజనాల లో కొన్నిటిని గురించి డాక్టర్ శ్రీ గోస్వామి తెలియజెప్పారు.

 

 

ఈ వర్క్ శాప్ లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఉమంగ్ నరూలా, అడిశనల్ సెక్రట్రి డాక్టర్ శ్రీ సత్య ప్రకాశ్, ఇతర అధికారులు మరియు మంత్రిత్వ శాఖ లోని ఉద్యోగులు పాలుపంచుకొన్నారు. యోగాభ్యాసం మరియు ప్రాణాయామం ల వల్ల ఒనగూరే స్పష్టమైన ప్రయోజనాల ను దృష్టి లో పెట్టుకొని, ఈ కార్యశాల కు విచ్చేసిన అధికారుల లో మరియు సిబ్బంది లో అమిత ఉత్సాహం వ్యక్తం అయింది.

 

***

 


(రిలీజ్ ఐడి: 2024754) సందర్శకుల సూచీ సంఖ్య : : 108
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Punjabi