రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షా రాజ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సంజయ్ శేఠ్
प्रविष्टि तिथि:
11 JUN 2024 3:36PM by PIB Hyderabad
రక్షణ శాఖ సహాయమంత్రిగా శ్రీ సంజయ్ శేఠ్ 2024 జూన్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరామనే, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు శ్రీ సంజయ్ శేఠ్ కు స్వాగతం పలికారు. తనకు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మార్గదర్శకంలో పని చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శ్రీ సంజయ్ సింగ్ అన్నారు. గతంలో కూడా తాను విభిన్న హోదాల్లో శ్రీ రాజ్ నాథ్ సింగ్ తో కలిసి పని చేశానని ఆయన చెప్పారు. జాతి భద్రతను పటిష్ఠం చేసే దిశగా రక్షణ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు శ్రీ సంజయ్ శేఠ్ న్యూఢిల్లీలోని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అధికార నివాసంలో ఆయనను కలిశారు.
శ్రీ సంజయ్ సింగ్ రాంచి లోక్ సభ నియోజకవర్గం నుంచి రెండో సారి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2019 సంవత్సరంలో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ స్థాయీ సంఘం సభ్యుడు, వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సభ్యుడుగా కూడా పని చేశారు. 2016-2019 సంవత్సరాల మధ్య కాలంలో జార్ఖండ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ గా కూడా శ్రీ సంజయ్ శేఠ్ పని చేశారు.

***
(रिलीज़ आईडी: 2024554)
आगंतुक पटल : 140