మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సుఖాంత మజుందార్
प्रविष्टि तिथि:
11 JUN 2024 4:04PM by PIB Hyderabad
కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రిగా నియమితులైన డాక్టర్ సుఖాంత మజుందార్ తన పదవీ బాధ్యత్నలి న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ లో స్వీకరించారు. కేంద్ర విద్యాశాఖ కార్యాలయానికి వచ్చిన ఆయనకు అక్కడ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి డాక్టర్ మజుందార్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్నాన్ని ప్రశంసిస్తూ ఆయనపట్ల తనకుగల కృతజ్ఞతాభావాన్ని ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్ కు అభినందనలు తెలియజేశారు. ఆయనకుగల విస్తారమైన అనుభవం తనకు ఉపయోగపడుతుందని విద్యారంగంలో ప్రధాని లక్ష్యాలను సాధించడానికి అది తనకు దోహదం చేస్తుందని అన్నారు.
17వ లోకసభ సభ్యునిగా కూడా డాక్టర్ సుఖాంత మజుందార్ సేవలందించారు. ఆయన సెప్టెంబర్ 2021నుంచి బెంగాల్ బిజెపి అధ్యక్షునిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బాలుర్‌ఘాట్ నియోజకవర్గాన్నించి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఉత్తర బెంగాల్ యూనివర్సిటీనుంచి ఆయన ఎమ్మెస్సీ, బిఇడితోపాటు వృక్షశాస్త్రంలో పిహెచ్ డి కూడా చేశారు. ఆయన 2019నుంచి సమాచార సాంకేతికత, ఫిర్యాదుల విభాగాలకు చెందిన స్టాండింగ్ కమిటీల సభ్యునిగా సేవలందించారు.
***
(रिलीज़ आईडी: 2024505)
आगंतुक पटल : 139