యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మన్సుఖ్ మాండవియా

నాడు పోస్టు చేయడమైనది: 11 JUN 2024 4:36PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిగా శ్రీ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు శాస్త్రి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కూడా శ్రీ మన్సుఖ్  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్రీడల శాఖ కార్యదర్శి, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే కూడా పాల్గొన్నారు.

 

మంత్రిత్వ శాఖ కు సంబంధించిన పథకాలు మరియు కార్యక్రమాల గురించి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. గతంలో ఆయన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2024491) సందర్శకుల సూచీ సంఖ్య : : 241
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam