ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి యొక్క పదవీ స్వీకారప్రమాణ కార్యక్రమం లో పాలుపంచుకొన్న భారతదేశ ఇరుగు పొరుగు దేశాల నేతలు మరియు హిందూమహాసముద్ర ప్రాంత దేశాల నేతలు

Posted On: 09 JUN 2024 11:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పాటు, మంత్రి మండలి యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమం 2024 జూన్ 9 వ తేదీ నాడు రాష్ట్రపతి భవన్ లో చోటు చేసుకొంది. ఈ కార్యక్రమం లో గౌరవ అతిథులు గా భారతదేశం చుట్టుప్రక్కల దేశాల కు చెందిన నేతలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల కు చెందిన నేతలు పాలుపంచుకొన్నారు.

 

ఈ కార్యక్రమాని కి హాజరు అయిన నేతల లో శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె; మాల్దీవులు యొక్క అధ్యక్షుడు డాక్టర్ శ్రీ మొహమ్మద్ ముయిజ్జు; సెశెల్స్ యొక్క ఉపాధ్యక్షుడు శ్రీ అహమద్ అఫిఫ్; బాంగ్లాదేశ్ యొక్క ప్రధాని శేఖ్ హసీనా గారు; మారిశస్ యొక్క ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ మరియు ఆయన సతీమణి; నేపాల్ యొక్క ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహల్ ప్రచండమరియు భూటాన్ యొక్క ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గే లు ఉన్నారు. ఇంకా, మల్దీవులు, బాంగ్లాదేశ్, నేపాల్ మరియు భూటాన్ ల నేతల వెంట ఆ దేశాల మంత్రులు కూడా తరలి వచ్చారు.

 

పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమం అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ లో అతిథి నేతల తో భేటీ అయ్యారు. చరిత్ర ను సృష్టించిన రీతి లో వరుస గా మూడో పర్యాయం భారతదేశాని కి ప్రధాన మంత్రి గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించినందుకు గాను ఆయన కు నేతలు అభినందనల ను తెలియ జేశారు. ఈ కార్యక్రమాని కి విచ్చేసినందుకు ప్రధాన మంత్రి వారికి ధన్యవాదాల ను పలుకుతూ, ‘నేబర్ హుడ్ ఫస్ట్పాలిసీ మరియు సాగర్ విజన్’ (‘SAGAR Vision’) ల విషయం లో భారతదేశం యొక్క వచన బద్ధత ను పునరుద్ఘాటించారు. ప్రధాన మంత్రి తన మూడో పదవీ కాలం లో భారతదేశం, ఇతర దేశాల సన్నిహిత భాగస్వామ్యం ద్వారా ఆ ప్రాంతం లో శాంతి ని, ప్రగతి ని మరియు సమృద్ధి ని పరిరక్షించడం కోసం నిరంతరం గా కృషి చేస్తూ ఉంటుందని, అదే కాలం లో వికసిత్ భారత్లక్ష్యాన్ని 2047 వ సంవత్సరాని కల్లా సాధించాలన్న లక్ష్యాన్ని అనుసరిస్తుందని తెలిపారు. ఈ సందర్భం లో హిందూ మహాసముద్ర ప్రాంత పరిధి లో గల దేశాల కు చెందిన ప్రజల మధ్య పరస్పర సంబంధాలు మరియు కనెక్టివిటీ ని విస్తృత పరచుకోవలంటూ పిలుపును ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి లో వికాసశీల (గ్లోబల్ సౌథ్) దేశాల యొక్క వాణిని భారతదేశం బిగ్గరగా వినిపిస్తూనే ఉంటుందని కూడా ఆయన అన్నారు.

 

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన ఒక విందు లో కూడా నేతలు పాలుపంచుకొన్నారు. వారికి రాష్ట్రపతి స్వాగతం పలుకుతూ, దేశ ప్రజల కు సేవ చేయడం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి తన శుభాకాంక్షల ను తెలియ జేశారు. భారతదేశం లో ప్రజాస్వామ్య ప్రక్రియ ఆ దేశ ప్రజల కు గర్వకారణమైనటువంటి ఒక సందర్భం మాత్రమే కాకుండా, ప్రపంచమంతటా లక్షల కొద్దీ ప్రజల కు ప్రేరణ ను ఇచ్చేదే అని ఆమె అన్నారు.

 

ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమం వంటి మహత్తరమైన సందర్భం లో భారతదేశం యొక్క ఇరుగు పొరుగు దేశాల నేతల తో పాటు, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేతలు కూడా పాలుపంచుకోవడం ఆ ప్రాంత దేశాల తో భారతదేశం నెలకొల్పుకొన్న మైత్రి మరియు సహకారం ల తాలూకు విస్తృతమైన బంధాన్ని ప్రస్ఫుటం చేస్తున్నది.

 

 

***



(Release ID: 2024467) Visitor Counter : 27