జౌళి మంత్రిత్వ శాఖ

కేంద్ర జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గిరిరాజ్‌ సింగ్‌


ప్రపంచ ఎగుమతుల్లో వస్త్ర పరిశ్రమ ప్రధాన వాటాదారుగా ఉంది: సింగ్‌

వస్త్ర పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు అపారం: సింగ్‌

Posted On: 11 JUN 2024 2:03PM by PIB Hyderabad

 

కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ జౌళి శాఖ మంత్రిగా ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా సమక్షంలో జౌళిశాఖ  మాజీ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ బాధ్యతలు అప్పగించారు.  

జౌళి శాఖ కార్యదర్శి రచనా షా, మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి  సింగ్‌ మాట్లాడుతూ ‘‘జౌళి రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎగుమతుల్లోనూ ఈ పరిశ్రమ పెద్ద వాటాదారుగా ఉంది’’ అని అన్నారు.  జౌళి పరిశ్రమ నేరుగా రైతులతో ముడిపడి ఉందని, ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో పనిచేస్తామన్నారు.

***



(Release ID: 2024463) Visitor Counter : 28