ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరాగ్‌ పాశ్వాన్‌

प्रविष्टि तिथि: 11 JUN 2024 2:44PM by PIB Hyderabad

కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రోజు న్యూఢిల్లీలో చిరాగ్‌ పాశ్వాన్‌ బాధ్యతలు చేపట్టారు.

 

Image

కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్‌ సహా ఇతర ఉన్నతాధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన  అనంతరం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పథకాలను పథకాలను సమీక్షించారు. ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలు తనకు అప్పగించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిత్వ శాఖ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి అన్ని విధాల కృషి చేస్తానన్నారు. అనంతరం  మంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు, భవిష్యత్ ప్రణాళికలపై జరిగిన సమీక్షా సమావేశానికి శ్రీ పాశ్వాన్‌ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ 100 రోజుల ప్రణాళికను సాధించే దిశగా పని చేయాలని అధికారులను ఆదేశించారు.

చిరాగ్ పాశ్వాన్‌ బిహార్లోని హజీపూర్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు.

***


(रिलीज़ आईडी: 2024459) आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Gujarati , Tamil , Kannada , Malayalam