సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి యొక్క పదవీబాధ్యత లను స్వీకరించిన శ్రీ లోగనాథన్ మురుగన్
Posted On:
11 JUN 2024 12:31PM by PIB Hyderabad
సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి గా డాక్టర్ శ్రీ ఎల్. మురుగన్ ఈ రోజు న పదవీ బాధ్యతల ను చేపట్టారు. ఈ సందర్భం లో ప్రసార మాధ్యమాల ప్రతినిధుల తో డాక్టర్ శ్రీ మురుగన్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనను నమ్మి ఈ బాధ్యతను తన అధీనం లో ఉంచినందుకు కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ప్రభుత్వాని కి మరియు దేశ ప్రజల కు మధ్య ఒక సమాచార సేతువు గా వ్యవహరించడం ద్వారా సమాచారం మరియు ప్రసారం మంత్రిత్వ శాఖ ప్రభుత్వ విధానాల ను అమలు పరచడం లో ఒక కీలక పాత్ర ను పోషిస్తుందని కూడా మంత్రి అన్నారు.
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కంకణం కట్టుకొంది, పట్టణ ప్రాంతాల లో మరియు గ్రామీణ ప్రాంతాల లో మూడు కోట్ల ఇళ్ళ ను ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లో భాగం గా నిర్మించాలని మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయం దీనికి ఒక దృష్టాంతం గా నిలచింది అని డాక్టర్ శ్రీ మురుగన్ అన్నారు.

డాక్టర్ శ్రీ మురుగన్ కు మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఇతర సీనియర్ అధికారులు మరియు మంత్రిత్వ శాఖ లో భాగం గా ఉన్న ప్రసార మాధ్యమాల విభాగాల ప్రతినిధులు స్వాగతం పలికారు.

***
(Release ID: 2024119)
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Nepali
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam