ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక అయిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన నెదర్లాండ్స్ప్రధాని శ్రీ మార్క్ రుటే


భారతదేశానికి మరియుర నెదర్లాండ్స్ కు మధ్య గల విశిష్టమైనమరియు విలువైన సంబంధాన్ని గురించి నొక్కిపలికిన నేత లు

ద్వైపాక్షికసంబంధాల ను మరింత గా బలపరచుకోవాలన్న తన వచనబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 JUN 2024 10:12PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నెదర్లాండ్స్ యొక్క ప్రధాని శ్రీ మార్క్ రుటే ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

 

 

ఎన్నికల లో విజయం సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల ను ప్రధాని శ్రీ మార్క్ రుటే తెలపడం తో పాటు గా చరిత్రాత్మకమైనటువంటి మూడో పదవీకాలానికి గాను శుభాకాంక్షల ను కూడ వ్యక్తం చేశారు.

ప్రధాని శ్రీ మార్క్ రుటే అందించిన హార్దిక శుభాకాంక్షల కు ప్రధాన మంత్రి ధన్యవాదాలను పలకడంతో పాటు గా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల ను పెంపొందింపచేయడం లో వ్యక్తిగతంగా చొరవ ను తీసుకొంటున్నందుకు గాను ఆయన ను ప్రశంసించారు.

 

భారతదేశానికి మరియు నెదర్లాండ్స్ కు మధ్య గల విశిష్టమైన మరియు విలువైన సంబంధాల ను గురించి నేతలు నొక్కిపలికారు.

 

ఇరు దేశాల ప్రజల హితం కోసం ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలపరచుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉండాలని ప్రధాన మంత్రి తన నిబద్ధత ను పునరుద్ఘాటించారు.

 

***

 


(रिलीज़ आईडी: 2023650) आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam