ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 JUN 2024 11:33AM by PIB Hyderabad

 

రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు మృతిపట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు రామోజీరావు అని మోదీ కొనియాడారు. ఆయన సేవలు సినీ,పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేశాయన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :

శ్రీ రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం.ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు.ఆయన సేవలు సినీ, పత్రికా రంగాలలో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషి ద్వారా, ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు.

రామోజీ రావు గారు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారు. ఆయనతో సంభాషించడానికి, ఆయన అపారమైన జ్ఞానాన్నుంచి లబ్ధి పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.

 

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2023569) आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam , Malayalam