భారత ఎన్నికల సంఘం
18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను రాష్ర్టపతికి అందించిన ఎన్నికల కమిషన్
Posted On:
06 JUN 2024 6:44PM by PIB Hyderabad
ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ఈ రోజు సాయంత్రం (జూన్ 6, 2024) 4 గంటల 30 నిముషాలకు గౌరవ భారత రాష్ర్టపతిని కలిశారు. 18వ లోక్‌సభకు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతినిధుల సభకు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల జాబితాతో ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 73కి అనుగుణంగా తాము జారీ చేసిన నోటిఫికేషన్ ప్రతిని రాష్ర్టపతికి అందచేశారు.
ఆ తర్వాత ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల సంఘం సీనియర్ అధికారులతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ 2024 సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు జాతిపిత ఆశీస్సులు అందుకోవడం కోసం రాజ్ఘాట్కు వెళ్లారు.
***
(Release ID: 2023517)
Visitor Counter : 125