ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి కి టెలిఫోన్ లో అభినందనల ను తెలిపిన ఆస్ట్రేలియాప్రధాని


ఆస్ట్రేలియా ప్రధాని శుభాకాంక్షలను తెలిపినందుకుధన్యవాదాలను పలికిన ప్రధాన మంత్రి

ఉమ్మడి ప్రాథమ్యాల విషయం లో కలసి పని చేయాలన్న తమనిబద్ధత ను  పునరుద్ఘాటించిన ఉభయ నేతలు

प्रविष्टि तिथि: 06 JUN 2024 2:14PM by PIB Hyderabad

ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథని అల్బనీజ్ ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో టెలిఫోన్ లో మాట్లాడి అభినందనల ను తెలియజేశారు. ఆస్ట్రేలియా ప్రధాని తనకు శుభాకాంక్షల ను తెలిపినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాలను పలికారు.

 

ఆస్ట్రేలియా ను 2023 వ సంవత్సరం లో సందర్శించిన తాను సంగతి ని మరియు దిల్లీ లో గడచిన సెప్టెంబర్ లో జి20 శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో ప్రధాని శ్రీ అల్బనీజ్ తో తాను సమావేశం కావడాన్ని ప్రధాన మంత్రి ఆప్యాయం గా గుర్తుకు తెచ్చుకొన్నారు.

 

ఆస్ట్రేలియా ప్రధాని తో కలసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢతరమైంది గా మలచడం మరియు ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఉమ్మడి ప్రాథమ్యాల విషయం లో కలిసికట్టు గా పని చేయాలన్నదే తన దృఢ నిబద్ధత అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

 

***

 


(रिलीज़ आईडी: 2023250) आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam