కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘పరిశ్రమ 4.0 పరివర్తన’ లో ఎమ్ఎస్ఎమ్ఇ లకు మరియు స్టార్ట్-అప్ లకు మద్దతు ను ఇచ్చేందుకు ఒక కార్యక్రమాన్నిప్రారంభించిన డిఒటి
‘‘ఇండస్ట్రీ 4.0 బేస్ లైన్ సర్వే అమాంగ్ ఎమ్ఎస్ఎమ్ఇ స్: ఫాస్టరింగ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్ మేశన్ థ్రూ 5జి/6జి టెక్నాలజీస్’’ కోసం ప్రతిపాదన ను అందించాలని పిలుపునివ్వడమైంది
ప్రముఖ సిఫారసులు ఇండస్ట్రీ 4.0 సంబంధి పరివర్తన స్వీకరణ లో విధాన పరమైన జోక్యాల కుగాను ఒక వేదిక ను ఏర్పాటు చేయగలవు
Posted On:
05 JUN 2024 3:06PM by PIB Hyderabad
పరిశ్రమ లో క్రొత్త గా ఉనికి లోకి వస్తున్న సాంకేతికతల ను అక్కున చేర్చుకొనే మాధ్యం ద్వారా సంస్థల కు మరియు స్టార్ట్-అప్స్ కు సాయపడాలనే ఉద్దేశ్యం తో టెలికమ్యూనికేశన్స్ విభాగం (డిఒటి) ఒక క్రొత్త కార్యక్రమానికి పథక రచన ను చేస్తున్నది. ‘‘ఇండస్ట్రి 4.0 ఎ బేస్ లైన్ సర్వే అమంగ్ ఎమ్ఎస్ఎమ్ఇ స్’’ అనే ప్రతిపాదన తో ముందుకు రావాలని డిఒటి పిలుపునిచ్చింది. ఈ ప్రతిపాదన డిజిటల్ పరివర్తన ను ప్రోత్సహించేదిగాను మరియు 5జి, ఇంకా 6జి సాంకేతికత ల రాకడ కోసం పరిశ్రమల ను సన్నద్ధం చేసే విస్తృతమైన విజన్ తో ఉండాలని పేర్కొనడమైంది.
కార్యక్రమం యొక్క స్థూల రూపం
ఇండస్ట్రి 4.0 కు తగిన విధం గా మారడం లోను మరియు ఆధునిక సాంకేతికతల ను ఉపయోగించడం లోను ఎమ్ఎస్ఎమ్ఇ లకు ఎదురయ్యే సవాళ్ళ ను అవగాహన చేసుకోవాలి అనేది ఈ సర్వేక్షణ యొక్క లక్ష్యం గా ఉంటుంది. ఎఐ, ఐఒటి, క్లౌడ్ కంప్యూటింగ్, 5జి మరియు 6జి నెట్ వర్క్ ల ఏకీకరణ ద్వారా సమకూరే శక్తి యుక్తుల తో లాభపడడం లో దక్షత కలిగినటువంటి ఒక బలమైన ఇకోసిస్టమ్ కు రంగాన్ని సిద్ధం చేయాలనేది ఈ సర్వేక్షణ పరమోద్దేశ్యం గా ఉంది. కనీసం పది రంగాల లో రంగం వారీ అవసరాల తో పాటు ప్రాథమ్యాల ను గుర్తించడం , ఎమ్ఎస్ఎమ్ఇ ల యొక్క వైవిధ్య భరితమైన ముఖచిత్రాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన ఆవిష్కారాల ను, స్పర్థాత్మకత ను సమర్థించడం వంటి అంశాలు దీనిలో భాగం గా ఉంటాయి.
సర్వేక్షణ 60 రోజుల లో భారతదేశం లో ఉత్తరాది మరియు దక్షిణాది ప్రాంతాల లోని అయిదేసి రంగాల ను లెక్క లోకి తీసుకొంటుంది. కీలకమైన సిఫారసు లు ఇండస్ట్రి 4.0 తాలూకు పరివర్తన పూర్వక విధానాల ను అవలంబించేటందుకు విధాన పరం గా తీసుకోబోయే నిర్ణయాల కు ఒక వేదిక ను సమకూర్చనుంది; తద్ద్వారా ఎమ్ఎస్ఎమ్ఇ లలో పోటీ తత్వం మరియు మనుగడ లలో వృద్ధి చోటుచేసుకొంటుంది.
కార్యాచరణకై పిలుపు
సంస్థ లు మరియు స్టార్ట్-అప్ స్ ఈ మార్పు ప్రధానమైనటువంటి సర్వేక్షణ లో పాలుపంచుకోవడం కోసం 2024 జూన్ 11 వ తేదీ కల్లా వాటి వాటి ప్రతిపాదనల ను సమర్పించాలి అని ఆహ్వానించడమైంది. ప్రతిపాదన ను సమర్పించడానికి అవసరమైన మార్గనిర్దేశకాలు మరియు మరిన్ని వివరాల ను ఈ క్రింద ఇచ్చిన లింకు ను చూసి తెలుసుకోవచ్చును.
https://tcoe.in/include/Call_of_Proposal_Baseline_Survey_of_MSMEs.pdf
***
(Release ID: 2022999)
Visitor Counter : 151