ప్రధాన మంత్రి కార్యాలయం
దేశం లో తీవ్రమైన ఎండ వేడిమి కొనసాగుతూ ఉండడం మరియురుతుపవనాల రాకడ ఆరంభం కావడం తో ముడిపడ్డ సన్నాహక చర్యల ను సమీక్షించిన ప్రధాన మంత్రి
మంటలు చెలరేగే ఘటనల ను అడ్డుకోవడం కోసం మరియు వాటి నిఎదుర్కోవడం కోసం క్రమం తప్పని రీతి న తగిన అభ్యాసాల ను నిర్వహిస్తూ ఉండాలి అనిఆదేశించిన ప్రధాన మంత్రి
ఆసుపత్రుల లోను మరియు ఇతర సార్వజనిక ప్రదేశాల లోనుఅగ్ని సురక్ష మరియు విద్యుత్తు సురక్ష చర్యల తాలూకు సమీక్ష ను క్రమం తప్పకఅమలుజరుపుతూ ఉండాలి అని ఆదేశాలను ఇచ్చిన ప్రధాన మంత్రి
దేశం లో చాలావరకు ప్రాంతాల లో రుతుపవనాలు సామాన్యం గాను,సామాన్యం నుండి అధికం గాను మరియు ద్వీపకల్ప భారతదేశం లోని కొన్ని ప్రాంతాల లోసామాన్యం కంటే తక్కువ గాను ఉండే సూచనలు ఉన్నాయని ప్రధాన మంత్రి కి తెలియజేయడమైంది
Posted On:
02 JUN 2024 3:00PM by PIB Hyderabad
దేశం లో తీవ్రమైన ఎండ వేడిమి కొనసాగుతూ ఉండడం మరియు రుతుపవనాల రాకడ ఆరంభం కావడం తో ముడిపడ్డ సన్నాహక చర్యల ను సమీక్షించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న 7, లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన నివాసం లో ఏర్పాటైన సమీక్ష సమావేశాని కి అధ్యక్షత ను వహించారు.
ఐఎమ్ డి యొక్క ముందస్తు అంచనా ల ప్రకారం, రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల లో తీవ్రమైన ఎండ వేడిమి కొనసాగే సూచన లు ఉన్నాయి అని ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడమైంది. ఈ సంవత్సరం లో, దేశం లో అనేక ప్రాంతాల లో రుతుపవనాలు సామాన్యం గాను మరియు సామాన్యం నుండి అధికం గాను ద్వీపకల్ప భారతదేశం లోని కొన్ని ప్రాంతాల లో సామాన్యం కంటే తక్కువ గాను ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
మంటలు చెలరేగే ఘటనల ను అడ్డుకోవడం కోసం మరియు వాటి ని ఎదుర్కోవడం కోసం క్రమం తప్పని రీతి న తగిన అభ్యాసాల ను నిర్వహిస్తూ ఉండాలి అని ప్రధాన మంత్రి ఆదేశించారు. ఆసుపత్రుల లోను మరియు ఇతర సార్వజనిక ప్రదేశాల లోను అగ్ని సురక్ష మరియు విద్యుత్తు సురక్ష చర్యల తాలూకు సమీక్ష ను క్రమం తప్పక అమలుజరుపుతూ ఉండాలి అని ఆయన అన్నారు. అరణ్యాల లో అగ్ని రేఖ యొక్క నిర్వహణ మరియు బయోమాస్ ను ఫలప్రదం గా ఉపయోగించుకోవడం కోసం ఎప్పటికప్పుడు అభ్యాసాలను చేపట్టే పథకాన్ని రూపొందించాలి అని కూడ ఆయన అన్నారు.
అడవుల లో మంటలు రేగే పరిణామాన్ని సకాలం లో గుర్తించడం లో మరియు అటువంటి స్థితి లో చేపట్టవలసిన కార్యాల విషయం లో ‘‘వన్ అగ్ని’’ పోర్టల్ యొక్క ఉపయోగం గురించి ప్రధాన మంత్రి కి తెలియ జేయడమైంది.
ఈ సమావేశం లో ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భూ విజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎన్ డిఆర్ఎఫ్ డిజి, ఎన్ డిఎమ్ఎ మెంబర్ సెక్రట్రి, పిఎంఒ లోని మరియు సంబంధి మంత్రిత్వ శాఖల లోని సీనియర్ అధికారులు పాలుపంచుకొన్నారు.
**
(Release ID: 2022573)
Visitor Counter : 117
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam