కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సేవ ప్రధానమైన కాల్స్ కు మరియు లావాదేవీ ల సంబంధివాయిస్ కాల్స్ కోసం ప్రత్యేకం గా వేరు వేరు నంబరు ల సిరీస్ ను కేటాయించిన డిఒటి


క్రొత్త 160xxxxxxx నంబరు సిరీస్ టెలిమార్కెటర్లు 10 అంకెల మొబైల్ నంబరుల ను ఉపయోగించి అవాంఛిత వాయిస్ కాల్స్ ను అడ్డుకోవడం లో సహాయపడుతుంది 

Posted On: 30 MAY 2024 7:47PM by PIB Hyderabad

సేవ/లావాదేవీల సంబంధి కాల్స్ చేయడం కోసం ఒక క్రొత్త సంఖ్య క్రమం 160xxxxxxx సిరీస్ ను టెలికమ్యూనికేశన్స్ విభాగం (డిఒటి) పరిచయం చేసింది. ఈ చొరవ పైరులకు చట్టబద్ధమైన కాల్స్ ను ఇట్టే గుర్తించేందుకు ఒక పద్ధతి ని అందించే దిశ లో ఒక అడుగు అని చెప్పాలి.

 

ప్రస్తుతం, 140xxxxxxx సిరీస్ తో మొదలయ్యే సిరీస్ ను టెలిమార్కెటర్ లకు ప్రమోశనల్/సేవ/లావాదేవీ సంబంధి వాయిస్ కాల్స్ ను చేసేందుకు గాను కేటాయించడమైంది. ఎందుకంటే 140xx సిరీస్ ను ప్రమోశనల్ కాల్స్ కోసం పెద్ద ఎత్తున వాడడం జరుగుతున్నది. అందుకని వినియోగదారులు సాధారణం గా ఆ తరహా కాల్స్ ను ఎత్తరు. మరి ఈ విధమైన అనేక ముఖ్య సేవ/లావాదేవీ సంబంధి కాల్స్ మిస్ అవుతున్నాయి. ఈ కారణం గా వాస్తవిక సంస్థల ద్వారా సేవ పరమైన/లావాదేవీ పరమైన కాల్స్ చేయడం కోసం రెగ్యులర్ గా పది అంకెల నంబరులను విస్తృతంగా ఉపయోగించడం జరుగుతోంది. దీనివల్ల దగాకోరుల కు 10 అంకెల నంబరులను ఉపయోగించి వినియోగదారుల ను మోసం చేసే అవకాశం కూడ దొరికింది.

 

ఈ కారణం గా, వినియోగదారుల లో విశ్వాసాన్ని పాదుకొల్పడానికి మరియు వారికి పది అంకెల తో కూడి ఉండే గుర్తు తెలియని నంబరు ల నుండి వచ్చే స్పామ్ కాల్స్ మరియు వాస్తవిక ప్రముఖ సంస్థల నుండి వచ్చే సేవ/లావాదేవీ సంబంధి కాల్స్ కు మధ్య తేడా ను పసిగట్టగలిగే సామర్థ్యాన్ని సంతరించడం కోసం, సేవ/లావాదేవీ సంబంధి వాయిస్ కాల్స్ కంటూ విడిగా వేరే నంబర్ సిరీస్ అవసరం ఉండింది.

 

ఈ అవసరాన్ని తీర్చడం కోసం, డిఒటి 160xxxxxxx తో మొదలయ్యేటటువంటి ఒక క్రొత్త నంబర్ సిరీస్ ను కేటాయించింది. ఈ క్రొత్త సిరీస్ ను ప్రధాన ఎంటిటీ స్ (సంస్థలు) అచ్చం గా సేవ పరమైన/లావాదేవీల పరమైన వాయిస్ కాల్స్ కోసం పెద్ద ఎత్తున ఉపయోగించనున్నాయి. సేవ/లావాదేవీల పరమైన కాల్స్ కు మరియు ఇతర విధాలైన కాల్స్ కు మధ్య ఈ స్పష్టమైన అంతరం పౌరుల కు వారి యొక్క మాటామంతీ నిర్వహణ ను సులభతరం చేసివేస్తుంది. ఉదాహరణ కు ఇక ఆర్‌బిఐ, ఎస్ఇబిఐ, పిఎఫ్‌ఆర్‌డిఎ, ఐఆర్‌డిఎ ల వంటి ఆర్థిక పరమైన సంస్థల నుండి వచ్చేటటువంటి సేవ ప్రధానమైన /లావాదేవీ సంబంధి కాల్స్ 1601 తో మొదలవుతాయన్న మాట.

 

టెలికం సేవల ప్రదాత సంస్థ (టిఎస్‌పి)లు 160 సిరీస్ నంబరు ను ఇచ్చే కంటే ముందు ప్రతి ఒక్క ఎన్ టిటీ ని గురించిన తగినంత ధ్రువీకరణ బాధ్యత ను తీసుకొంటాయి. టెలికం కమర్శియల్ కమ్యూనికేశన్ కస్టమర్ ప్రిఫెరెన్స్ రెగ్యులేశన్ (టిసిసిసిపిఆర్), 2018 కి అనుగుణం గా సేవ/లావాదేవీ పరమైన కాల్స్ కు మాత్రమే ఆ నంబరు ను ఉపయోగించడం జరుగుతుందనే హామీ ని ఆ ఎంటిటీ ఇస్తుంది.

 

వినియోగదారుల కు 160xxxxxxx సిరీజ్ నుండి కాల్ చెల్లుబాటు ను గురించి అధిక భరోసా కలగడం తో, మోసపూరిత కాల్స్ కు ఎర అయ్యే ప్రమాదం తగ్గిపోతుంది. మోసపూరితమైన సందేశాలేమో అని అనుమానం కలిగితే గనుక పౌరులు దానిని గురించి సంచార్ సాథీ (www.sancharsaathi.gov.in) లో చక్షు లో ఫిర్యాదు చేయవచ్చు అని వారి కి సలహా ను ఇవ్వడమైంది.

 

టెలికం రెగ్యులేటరీ ఆథారిటి ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ) యొక్క డు నాట్ డిస్టర్బ్ (డిఎన్‌డి) ఫీచరు ను ఏక్టివేట్ చేసుకోవలసింది గా వినియోగదారుల ను డిఒటి ప్రోత్సహిస్తున్నది. ఇలా ఏక్టివేట్ చేసుకోవడం ద్వారా కోరనటువంటి ప్రమోశనల్ కాల్స్ ను అడ్డుకోవడం సాధ్యమవుతుంది. దీనితో స్పామ్ బారి న పడకుండా వారికి సురక్ష మరింత గా పెరిగిపోతుందన్నమాట.

 

క్రొత్త నంబరు పథకం గురించిన వివరాలు

(https://dot.gov.in/accessservices/allocation-separate-numbering-series-exclusively-service-and-transactional-voice)

 

సర్వీస్ కాల్ అంటే అర్థం ఏమిటి అంటే అది సదరు కాల్ ను అందుకొనే వ్యక్తి యొక్క అనుమతి ని తీసుకొని, తేదా ఈ ఉద్దేశ్యం కోసం రిజిస్టర్ అయినటువంటి టెంప్ లేట్ ను ఉపయోగంచి ధ్వని కాల్; ఈ తరహా కాల్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం వాణిజ్యపరమైన లావాదేవీ ని సౌకర్యవంతం అయినటువంటిది గా మలచడం, పూర్తి చేయడం లేదా ప్రాప్తిదారు ముందుగానే పంపే వ్యక్తి కి తన సమ్మతి ని తెలియజేసినట్లు నిర్ధరించడం; లేదా ప్రాప్తిదారు ద్వారా ఉపయోగం జరిగినట్టి లేదా కొనుగోలు చేసినటువంటి వాణిజ్యపరమైన ఉత్పాదన లేదా సేవ విషయం లో వారంటీ సంబంధి సమాచారం, ఉత్పాదనను వాపసు ఇచ్చేందుకు సంబంధించిన సమాచారం, సురక్ష లేదా సురక్ష సంబంధఇ వివరాల ను తెలియజేయడం అన్నమాట.

 

లావాదేవీ సంబంధి కాల్ (ట్రాన్‌జాక్శనల్ కాల్) అంటే అర్థం, ప్రచారాత్మక స్వభావాన్ని కలిగివున్నటువంటి కాల్ కాదు అని; అంతేకాక తన వినియోగదారుల ను లేదా ఖాతాదారుల ను అప్రమత్తం చేయాలన్న ఉద్దేశ్యం ఉన్న కాల్ కూడ. వాయస్ కాల్ ద్వారా పంపించే సమసాచారం సమయ దృష్టి నుండి చూసినప్పుడు మహత్త్వపూర్ణమైనది;

 

ప్రమోశన్ కాల్ అంటే వాణిజ్య ప్రధానమైన సందేశం తో వచ్చేటటువంటి వాయస్ కాల్; దీని కోసం ఆ కాల్ ను పంపించే అవతలి పక్షం కాల్ ను అందుకొనే వ్యక్తి నుండి ఈ తరహా వాయస్ కాల్ కోసం ఎటువంటి స్పష్టమైన సమ్మతి ని తీసుకోలేదు అని అర్థం.

 

***



(Release ID: 2022309) Visitor Counter : 76