ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జెనీవాలో జరుగుతున్న 77వ ప్రపంచ ఆరోగ్య సభలో భాగంగా నార్వే, యునిసెఫ్, యుఎన్ ఎఫ్ పిఎ, పిఎం సిహెచ్ సహకారంతో మహిళలు, పిల్లలు, కౌమార ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన భారతదేశం


మహిళలు, పిల్లలు మరియు కౌమార ఆరోగ్యం,శ్రేయస్సు కోసం భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరించారు

కౌమార వర్గాలకు ప్రణాళిక అర్థం కావడానికి సరైన సమాచార వ్యూహాలు అమలు చేయాలి.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి

प्रविष्टि तिथि: 30 MAY 2024 3:50PM by PIB Hyderabad

జెనీవాలో జరుగుతున్న 77వ ప్రపంచ ఆరోగ్య సభలో భాగంగా  యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యుఎన్ఎఫ్పిఎ), పార్టనర్షిప్ ఫర్ మదర్ న్యూ బోర్న్ అండ్ చైల్డ్ హెల్త్  (పిఎంఎన్సిహెచ్) సహకారంతో మహిళలు, పిల్లలు, కౌమార ఆరోగ్యంపై భారతదేశం  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.  మాతా, నవజాత శిశువు, శిశు, కౌమార ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో  పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను చర్చించడానికి. ఈ రంగాల్లో వస్తున్న మార్పులు,ఆవిష్కరణలను చర్చించి దేశాల మధ్య సహకారం పెంపొందించడం లక్ష్యంగా  ఈ కార్యక్రమం జరిగింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ రంగాల్లో పెట్టుబడులు కొనసాగించడం, పెట్టుబడులు ఎక్కువ చేయడానికి అమలు చేయాల్సిన విధానాల రూపకల్పన చేయడం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. 

 కౌమార ఆరోగ్యంపై సమావేశంలో ప్రధానంగా చర్చలు జరిగాయి. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కౌమార ఆరోగ్యం, కౌమార ఆరోగ్య రంగంలో మరింత పెట్టుబడి పెట్టవలసిన అవసరం తదితర అంశాలను ప్రస్తావించారు.  కౌమార ఆరోగ్య రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిని భారత బృందానికి నాయకత్వం వహించిన   కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర వివరించారు. కౌమార ఆరోగ్యం కోసం అమలు జరుగుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. 

మహిళలు, పిల్లలు, కౌమారదశల ఆరోగ్యం, సంక్షేమం  కోసం పటిష్ట  చర్యలు అమలు చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని  శ్రీ అపూర్వ చంద్ర తెలిపారు.  భారతదేశం అమలు చేస్తున్న  పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం (ఆర్ సి హెచ్) - I,  ఆర్ సి హెచ్   - II కార్యక్రమాలు, కౌమార ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న  రాష్ట్రీయ కిషోర్ స్వస్థ  కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.  TeleManas కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 

సరైన సమాచార ప్రణాళిక ద్వారా కౌమార దశలో ఉన్న ప్రజలకు తగిన సమాచారం అందించాలని భారతదేశం అభిప్రాయపడింది. కార్యక్రమాల రూపకల్పన, అమలు చేయడానికి  యువతకు  భాగస్వామ్యం కల్పించాలని  భారతదేశం సూచించింది. 

కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి హెకాలి జిమోమి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎన్ హెచ్ ఎం  మేనేజింగ్ డైరెక్టర్  శ్రీమతి ఆరాధనా పట్నాయక్,  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2022287) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Punjabi , Tamil , Kannada