రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

గగనం నుండి ఉపరితలం మీదకు దాడి చేసేటటువంటి రుద్రఎమ్-II క్షిపణి ని ఒడిశా కోస్తా తీరాని కి ఆవల ఎస్‌యు-30 ఎమ్‌కె-I నుండి విజయవంతం గా పరీక్షించిన డిఆర్‌డిఒ

Posted On: 29 MAY 2024 4:56PM by PIB Hyderabad

రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) 2024 మే నెల 29 వ తేదీ న ఉదయం సుమారు 11 గంటల 30 నిమిషాల వేళ లో భారతీయ వాయు సేన (ఐఎఎఫ్) కు చెందిన సుఖోయి-30 ఎమ్‌కె-I ప్లాట్ ఫార్మ్ ద్వారా నింగి నుండి ఉపరితలాని కి దాడి చేయగల రుద్ర-II క్షిపణి ని ఒడిశా కోస్తా తీరాని కి ఆవల విజయవంతం గా పరీక్షించింది. దీనితో ప్రపల్శన్ వ్యవస్థ మరియు నియంత్రణ, ఇంకా పథ ప్రదర్శనల కు సంబంధించిన గణాంకాల విషయం లో కచ్చితత్వాన్ని సాధించడం తో పాటు ఈ పరీక్ష తాలూకు ఉద్దేశ్యాలు నెరవేరినట్లు అయింది. క్షిపణి పరీక్ష కాలం లో చేపట్టిన ప్రతి ఒక్క కార్యకలాపాన్ని ఆన్-బోర్డ్ వెసల్ తో పాటు వేరు వేరు స్థలాల లో చాందీపుర్ లోని ఏకీకృత పరీక్ష శ్రేణి ద్వారా మోహరింప చేసిన ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్, రేడార్ మరియు టెలిమెట్రి స్టేశన్ ల వంటి రేంజ్ ట్రాకింగ్ పనిముట్టు ల మాధ్యం ద్వారా అందుకొన్న వివరాల తో ప్రామాణికం చేయడమైంది.

 

రుద్రఎమ్-II దేశీయం గా అభివృద్ధిపరచిన ఘన ఇంధన చోదక వాయు ప్రక్షేపిత క్షిపణి వ్యవస్థ. ఇది శత్రువు కు చెందిన అనేక రకాలైన ఆయుధాల ను నష్టపరచడం కోసం నింగి నుండి ఉపరితలం మీదకు దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగివుంది. డిఆర్‌డిఒ కు చెందిన విభిన్న ప్రయోగశాలలు అభివృద్ధి పరచినటువంటి అనేక అత్యాధునిక దేశీయ సాంకేతికతలను ఈ క్షిపణి వ్యవస్థ లో అమర్చడమైంది.

 

రుద్రఎమ్-II ను ఫలప్రదం గా పరీక్షించడం పట్ల డిఆర్‌డిఒ కు, భారతీయ వాయు సేన కు మరియు రక్షణ పరిశ్రమ కు అభినందనల ను రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ తెలియజేశారు. పరీక్ష విజయవంతం కావడం అనేది సాయుధ దళాల లో రుద్రఎమ్-II వ్యవస్థ యొక్క పాత్ర ను శక్తివర్థకం గా పటిష్ట పరచింది అని ఆయన అన్నారు.

 

పరీక్ష ను విజయంతం చేసినందుకు డిఆర్‌డిఒ బృందాన్ని వారి అలుపెరుగని ప్రయాసలు మరియు తోడ్పాటు కు గాను రక్షణ విభాగానికి చెందిన ఆర్&డి కార్యదర్శి మరియు డిఆర్‌డిఒ యొక్క చెయర్ మెన్ డాక్టర్ సమీర్ వి. కామత్ ప్రశంసించారు.

 

***



(Release ID: 2022232) Visitor Counter : 120