విద్యుత్తు మంత్రిత్వ శాఖ

అవుట్‌లుక్ ప్లానెట్ సస్‌టేనబిలిటీ సమిట్ & అవార్డ్ స్ 2024 లో ‘సస్‌టేనబిలిటీ  చాంపియన్ - ఎడిటర్స్ చాయిస్ అవార్డ్’ ను గెలుచుకొన్న ఆర్ఇసి

Posted On: 29 MAY 2024 8:00AM by PIB Hyderabad

విద్యుత్తు మంత్రిత్వ శాఖ అధీనం లోని ఒక మహారత్నహోదా ను కలిగివున్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మరియు ప్రముఖ బేంకింగేతర ఆర్థిక సహాయ సంస్థ (ఎన్ బిఎఫ్ సి) ఆర్ఇసి లిమిటెడ్ ను అవుట్‌లుక్ ప్లానెట్ సస్‌ టేనబిలిటీ సమిట్ & అవార్డ్ స్ 2024లో సస్‌టేనబిలిటీ చాంపియన్-ఎడిటర్స్ చాయిస్ అవార్డ్తో సమ్మానించడమైంది. పురస్కార కార్యక్రమాన్ని ఐఐటి గోవా సహకారం తో అవుట్ లుక్ గ్రూపు నిర్వహించింది.

 

ఈ పురస్కారం సస్‌టేనబిలిటీ సంబంధి కార్యక్రమాల పట్ల ఆర్ఇసి యొక్క నిబద్ధత ను మరియు ఒక హరిత ప్రధానమైనటువంటి భవిష్యత్తు దిశ లో ప్రగతి కి చోదకం గా నిలుస్తున్న ఆ సంస్థ యొక్క ప్రయాసల ను గుర్తించేది గా ఉంది. ఈ పురస్కారం కార్పొరేశన్ యొక్క సస్‌టేనబిలిటీ ప్రధానమైన కార్యక్రమాల తాలూకు ప్రతిజ్ఞ ను ప్రముఖం గా చాటి చెప్తున్నది. హరిత భవిష్యత్తు వైపునకు వడివడిగా అడుగులు వేయాలి అని ఆర్ఇసి సంకల్పించింది.

 

ఈ పురస్కారాన్ని గోవా లో జరిగిన ఒక కార్యక్రమం లో ఆర్ఇసి ముంబయి కార్యాలయం లో సీనియర్ జనరల్ మేనేజర్ శ్రీమతి సరస్వతి అందుకొన్నారు.

 

భారతదేశం శక్తి పరివర్తన కు ఉత్ప్రేరకం వంటి భూమిక ను నిర్వహిస్తున్న సంస్థల లో ఆర్ఇసి అగ్రస్థానాన నిలుస్తున్నది. ఈ సంస్థ యొక్క ప్రణాళిక లు స్వచ్ఛ శక్తి వనరుల దిశ లో ప్రపంచ దేశాలు చేస్తున్న కృషి కి అనుగుణం గా ఉన్నాయి; మరి, ఈ కంపెనీ భారతదేశం యొక్క శక్తి పరివర్తన విషయం లో ఆర్థిక సహాయాన్ని అందించే సంస్థల లో ఒక ప్రముఖ పాత్ర ను పోషించాలి అని కంకణం కట్టుకొంది. నవీకరణ యోగ్య శక్తి రంగం లో దాదాపు గా 38,971 కోట్ల రూపాయల మేరకు ఆర్ఇసి యొక్క వర్తమాన రుణ పోర్టుఫోలియో ను పట్టి చూస్తే సస్‌టేనబిలిటీ సంబంధి కార్యక్రమాల లో చెప్పుకోదగ్గ రాశి ని పెట్టుబడిగా పెట్టడానికి ఆర్ఇసి నడుం బిగించినట్లు తెలుస్తుంది. ఈ కంపెనీ రీన్యూవబుల్స్ 2030 వ సంవత్సరాని కల్లా దాదాపు గా 10 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన రుణాల ను మంజూరు చేయాలన్న లక్ష్యం లో భాగం గా సుమారు 30 శాతం వరకు రుణాల ను రీన్యూవబుల్స్ కు ఇవ్వాలి అనేది కూడ ఒక లక్ష్యం గా ఉంది.

 

 

అవుట్‌లుక్ ప్లానెట్ సస్‌ టేనబిలిటీ సమిట్ & అవార్డ్ స్ అనేది స్థిరత్వం తో కూడిన శక్తి ప్రయాసల లో ఉత్కృష్టత సాధన ను ప్రోత్సహించడం కోసం పరిశ్రమ లోని ప్రముఖులను, విధాన రూపకర్తల ను మరియు సస్ టేనబిలిటి సమర్థకుల కు ఒక చోటుకు తీసుకు వస్తున్నది. ఈ సంవత్సరం లో నిర్వహించిన శిఖర సమ్మేళనం లో లోతైన చర్చల తో పాటు గా నూతనత్వం ప్రధానమైన ఆలోచన లు భాగం అయ్యాయి. అంతేకాక స్థిరత్వం కోసం అంకితమైనటువంటి సంస్థ ల చెప్పుకోదగ్గ కార్యసాధనల కు ఈ శిఖర సమ్మేళనం లో మాన్యత ను ఇవ్వడమైంది.

 

ఆర్ఇసి లిమిటెడ్ ను గురించి

 

ఆర్ఇసి భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిపాలక నియంత్రణ లో నడుస్తున్న ఒక మహారత్నస్థాయి కలిగినటువంటి కంపెనీ; అంతేకాదు, ఇది బేంకింగేతర ఆర్థిక సహాయ సంస్థ (ఎన్‌బిఎఫ్‌సి) గా, పబ్లిక్ ఫైనాన్శియల్ ఇన్‌స్టిట్యూశన్ (పిఎఫ్ఐ) మరియు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ (ఐఎఫ్‌సి) గా ఆ‌బిఐ వద్ద నమోదు అయింది. విద్యుత్తు రంగం లో మౌలిక సదుపాయాల కల్పన కు ఆర్ఇసి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. ఆర్ ఇసి సంపూర్ణ విద్యుత్తు మౌలిక సదుపాయాల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. దీనిలో ఉత్పాదన, ట్రాన్స్ మిశన్ (వితరణ, నవీకరణ యోగ్య శక్తి మరియు విద్యుత్తు వాహనాలు, బ్యాటరీ నిలవ, పంప్ నిలవ ప్రాజెక్టు లు, గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ప్రాజెక్టు లు కలసి ఉన్నాయి. ఇటీవలే ఆర్ఇసి లిమిటెడ్ విద్యుత్తు యేతరమైనటువంటి మౌలిక సదుపాయాల రంగం లో కూడా తన కార్యకలాపాల ను మొదలు పెట్టింది. దీనిలో భాగం గా రహదారులు, ఎక్స్ ప్రెస్ వేస్, మెట్రో రైలు, విమానాశ్రయాలు, ఐటి కమ్యూనికేశన్, విద్య సంస్థలు, ఆసుపత్రులు వంటి సామాజిక మరియు వాణిజ్య ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన, నౌకాశ్రయాలు, ఇంకా ఉక్కు, రిఫైనరీ ల వంటి వివిధ ఇతర రంగాల కు చెందిన ఎలక్ట్రో-మెకానికల్ పనులు (ఇ&ఎమ్ ) భాగం గా ఉన్నాయి. ఆర్ఇసి లిమిటెడ్ దేశం లో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం రాష్ట్ర, కేంద్ర కంపెనీల కు మరియు ప్రైవేటు కంపెనీల కు వేరు వేరు గడువుల తో కూడిన రుణాల ను అందిస్తున్నది.

 

 

విద్యుత్తు రంగం లో ప్రభుత్వ ప్రధాన పథకాల లో ఆర్ఇసి లిమిటెడ్ ఒక కీలకమైన వ్యూహాత్మక భూమిక ను పోషిస్తూ వస్తున్నది; అలాగే, ఈ సంస్థ ప్రధాన మంత్రి సహజ్ బిజ్‌లీ హర్ ఘర్ యోజన (ఎస్ఎయుబిహెచ్ఎజిఎవైఎ - సౌభాగ్య), దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన (డిడియుజికెవై) మరియు నేశనల్ ఎలక్ట్రిసిటీ ఫండ్ (ఎన్ఇఎఫ్) స్కీమ్ లకు నోడల్ ఏజెన్సీ గా ఉంటున్నది. ఎన్ఇఎఫ్ పథకం వల్ల దేశం లో 100 శాతం పల్లెల్లో విద్యుతీకరణ, ప్రతి కుటుంబాని కి విద్యుత్తు సరఫరా, దేశం లో అన్ని గ్రామాల విద్యుతీకరణ, ఇంకా విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ను చివరకంటా పటిష్ట పరచాలి అనే లక్ష్యాలు నెరవేరుతాయి. ఆర్ఇసి ని రీవాంప్ డ్ డిస్ట్రిబ్యూశన్ సెక్టర్ స్కీమ్ (ఆర్‌డిఎస్ఎస్) అనే ఉద్దేశం తో కు కొన్ని రాష్ట్రాల లో, కేంద్ర పాలిత ప్రాంతాల లో నోడల్ ఏజెన్సీ ని చేయడమైంది. ఆర్ఇసి కి పిఎమ్ సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన బాధ్యత ను కూడా ఇవ్వడమైంది. 2024 మార్చి నెల 31 వ తేదీ నాటికి ఆర్ఇసి యొక్క లోన్ బుక్ 5.09 లక్షల కోట్ల రూపాయలు గాను, నికర విలువ 68,783 కోట్ల రూపాయలు గాను ఉన్నాయి.

 

***



(Release ID: 2022059) Visitor Counter : 86